మహిళపై దాడి చేసిన కేసులో.. నోరు విప్పిన జొమాటో డ్రైవర్

ABN , First Publish Date - 2021-03-14T10:58:58+05:30 IST

ఫుడ్ డెలివరీ ఆర్డర్ చేసిన ఓ మహిళపై దాడి చేశాడంటూ ఓ జొమాటో డ్రైవర్‌పై కేసు నమోదైంది. అయితే ఈ కేసులో తన తప్పేమీ లేదని, తాను ఎవరి మీదా దాడి చేయలేదని సదరు జొమాటో డెలివరీ ఎగ్జిక్యూటివ్ తెలిపాడు.

మహిళపై దాడి చేసిన కేసులో.. నోరు విప్పిన జొమాటో డ్రైవర్

ఇంటర్నెట్ డెస్క్: ఫుడ్ డెలివరీ ఆర్డర్ చేసిన ఓ మహిళపై దాడి చేశాడంటూ ఓ జొమాటో డ్రైవర్‌పై కేసు నమోదైంది. అయితే ఈ కేసులో తన తప్పేమీ లేదని, తాను ఎవరి మీదా దాడి చేయలేదని సదరు జొమాటో డెలివరీ ఎగ్జిక్యూటివ్ తెలిపాడు. ఈ విషయంలో నిజం గెలవాలని, చట్టబద్ధంగా ఈ ఆరోపణలపై పోరాడతానని అతను స్పష్టం చేశాడు. ‘‘15ఏళ్ల క్రితం మా నాన్న కన్నుమూశారు. అమ్మకు ఆరోగ్యం సరిగా లేదు. కుటుంబ భారం మొత్తం నేనే మోస్తున్నా’’ అని వివరించిన అతను.. ఆర్డర్ ఇచ్చిన కస్టమరే తనపై దాడి చేసి చెప్పలతో కొట్టినట్లు పేర్కొన్నాడు.

Updated Date - 2021-03-14T10:58:58+05:30 IST