స్నేహితుల మధ్య గొడవ.. కాలిబూడిదైన 10 వాహనాలు

ABN , First Publish Date - 2021-01-14T02:10:03+05:30 IST

అంతే ఆ గొడవ కాస్తా ముదిరి ఇద్దరినీ శత్రువులుగా మార్చింది. రితురాజ్‌కు ఏదైనా నష్టం చేయాలని భావించిన రోహిత్.. అతడి వాహనాన్ని తగలబెట్టడానికి రితురాజ్ ఉండే అపార్ట్‌మెంట్‌కు వెళ్లాడు. గోడ దూకి పార్కింగ్‌లో ఉన్న రితురాజ్

స్నేహితుల మధ్య గొడవ.. కాలిబూడిదైన 10 వాహనాలు

పూణె: ఇద్దరు స్నేహితుల మద్య ఏర్పడిన గొడవ.. చిలికి చిలికి గాలివానై 10 వాహనాలను కాల్చి బూడిద చేసింది. మహారాష్ట్రలోని పూణె సమీపంలో చించ్‌వాడలో మంగళవారం రాత్రి వెలుగు చూసిందీ సంఘటన. స్నేహితుల మధ్య వచ్చిన డబ్బుల గోడవతో తోటి స్నేహితుడి వాహనానికి నిప్పు పెట్టడానికి ప్రయత్నించాడు. ప్రారంభం బాగానే జరిగినా పార్కింగ్ ప్రదేశం కావడంతో ఆ నిప్పుడు అక్కడే పార్కింగ్‌లో ఉన్న మిగిలిన వాహనాలకూ అంటుకుంది. దీనికి కారణమైన చించ్‌వాడకు చెందిన రోహిత్ రవీంద్ర కాన్సే (23)పై స్నేహితుడు రితురాజ్ ఫిర్యాదు చేయడంతో అతడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు స్థానిక పోలీసులు తెలిపారు.


వివాదం తలెత్తింది ఇలా..

రోహిత్, రితురాజ్.. ఇద్దరు కలిసి వ్యాపార సంబంధమైన కార్యకలాపం కోసం ఒక కెమెరా కొన్నారు. దీని కోసం బ్యాంకులో కొంత మొత్తంలో లోన్ తీసుకున్నారు. అయితే ఇక్కడే వివాదం తలెత్తింది. నెల నెలా చెల్లించే ఈఎంఐ విషయమై ఇద్దరి మధ్య వివాదం తలెత్తింది. అంతే ఆ గొడవ కాస్తా ముదిరి ఇద్దరినీ శత్రువులుగా మార్చింది. రితురాజ్‌కు ఏదైనా నష్టం చేయాలని భావించిన రోహిత్.. అతడి వాహనాన్ని తగలబెట్టడానికి రితురాజ్ ఉండే అపార్ట్‌మెంట్‌కు వెళ్లాడు. గోడ దూకి పార్కింగ్‌లో ఉన్న రితురాజ్ వాహనానికి నిప్పు పెట్టాడు. అయితే పార్కింగ్‌లో మరిన్ని వాహనాలు ఉండడంతో రితురాజ్ వాహనం మంటలు మిగిలిన వాటికి అంటుకున్నాయి. ఇలా 10 వాహనాలు మంటల్లో బూడిదయ్యాయి. ఈ ఘటన అంతా సీసీటీవీ పుటేజీల్లో రికార్డు అయిందని, అది పోలీసులకు అందించామని రోహిత్ పేర్కొన్నాడు.

Updated Date - 2021-01-14T02:10:03+05:30 IST