కరోనా కారణంగా అనాథలైన పిల్లలకు ఆసరా: సీఎం యోగి
ABN , First Publish Date - 2021-05-20T15:35:21+05:30 IST
ఉత్తరప్రదేశ్‌లో కరోనా ఇన్‌ఫెక్షన్ కారణంగా తల్లిదండ్రులను...

లక్నో: ఉత్తరప్రదేశ్‌లో కరోనా ఇన్‌ఫెక్షన్ కారణంగా తల్లిదండ్రులను కోల్పోయిన పిల్లల పూర్తి బాధ్యతీసుకుంటున్నట్లు యోగి సర్కారు ప్రకటించింది. అధికారులతో జరిగిన సమావేశంలో ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. కరోనా సెకెండ్ వేవ్‌లో చాలా మంది చిన్నారులు తమ తల్లిదండ్రులను కోల్పోయి, అనాథలుగా మారారు.
వీరంతా ఇప్పుడు దిక్కుతోచని స్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు. ఈ పరిస్థితిని గమనించిన ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ దీనికి సంబంధించి సమగ్ర కార్యాచరణ ప్రణాళికను మహిళా, శిశు సంక్షేమశాఖ సిద్ధం చేయాలని ఆదేశించారు. అంతకుముందు ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ కోవిడ్ టీమ్ -9 అధికారులతో సమావేశమయ్యారు. ప్రైవేట్ ఆస్పత్రుల్లో అధిక ఛార్జీలు వసూలు చేసేవారిపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.