యోగాలో గుమ్మిడిపూండి విద్యార్థి record

ABN , First Publish Date - 2021-10-19T16:26:20+05:30 IST

యోగాలో గుమ్మిడిపూండి విద్యార్థి గిన్నిస్‌ రికార్డు నెలకొల్పాడు. తిరువళ్లూర్‌ జిల్లా గుమ్మిడిపూండికి చెందిన ప్రభు, కలైసెల్వి కుమారుడు హరీష్‌కన్న (9) పట్టణంలోని ఓ ప్రైవేటు పాఠశాలలో నాలుగవ తరగతి చదు

యోగాలో గుమ్మిడిపూండి విద్యార్థి record

గుమ్మిడిపూండి(chennai): యోగాలో గుమ్మిడిపూండి విద్యార్థి గిన్నిస్‌ రికార్డు నెలకొల్పాడు. తిరువళ్లూర్‌ జిల్లా గుమ్మిడిపూండికి చెందిన ప్రభు, కలైసెల్వి కుమారుడు హరీష్‌కన్న (9) పట్టణంలోని ఓ ప్రైవేటు పాఠశాలలో నాలుగవ తరగతి చదువుతున్నాడు. హరీష్‌ పట్టణంలోని శ్రీ శంకరి యోగా శిక్షణా కేంద్రంలో శిక్షణ పొందుతున్నాడు. ఈ నేపథ్యంలో, నేలపై తల ఉంచి, తలపై కాళ్లు పెట్టుకొనే శలభాసనంను సుమారు 45 నిముషాలు వేసి ఇండియా బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌లో చోటు దక్కించుకున్నాడు. విద్యార్థి హరీష్‌ను పట్టణ ప్రముఖులు, యోగా కేంద్ర శిక్షకులు సంధ్య అభినందించారు.

Updated Date - 2021-10-19T16:26:20+05:30 IST