రెజ్ల‌ర్ ది గ్రేట్ ఖ‌లీకి మాతృ వియోగం!

ABN , First Publish Date - 2021-06-21T15:06:40+05:30 IST

డబ్ల్యుడబ్ల్యుఈ స్టార్ రెజ్లర్ ది గ్రేట్ ఖలీ...

రెజ్ల‌ర్ ది గ్రేట్ ఖ‌లీకి మాతృ వియోగం!

న్యూఢిల్లీ: డబ్ల్యుడబ్ల్యుఈ స్టార్ రెజ్లర్ ది గ్రేట్ ఖలీ దలీప్ సింగ్ తల్లి చండీదేవి కన్నుమూశారు. ఆమె వయస్సు 75 సంవత్సరాలు. చండీదేవి చాలాకాలంగా అనారోగ్యంతో బాధ‌ప‌డుతున్నారు. లూధియానాలోని డీఎంసీ ఆసుపత్రిలో ఆమె తుదిశ్వాస విడిచారు. గతవారం అనారోగ్యంతో ఆమె ఆసుపత్రిలో చేరారు. ఆమె మృతదేహం ఆదివారం అర్థరాత్రి నైనిధర్ గ్రామానికి చేరుకుంది. చండీదేవి అంత్య‌క్రియ‌లు ఈ రోజు జ‌ర‌గ‌నున్నాయి. మీడియాకు అందిన వివ‌రాల ప్ర‌కారం ఆమె జూన్ 14 న ఆసుపత్రిలో చేరారు. ఆరోగ్యం విష‌మించ‌డంతో ఆమెను ఐసీయూకు షిఫ్ట్ చేశారు. అక్క‌డ చికిత్స పొందుతూ ఆమె మృతి చెందారు.  తమ‌ తల్లి అంత్య‌క్రియ‌లు సోమవారం నిర్వహిస్తామని ఖలీ సోద‌రుడు తెలిపారు. 


Updated Date - 2021-06-21T15:06:40+05:30 IST