‘వర్క్ ఫ్రమ్ హోం’తో... గూగుల్‌కు రూ. 7500 కోట్లు మిగులు

ABN , First Publish Date - 2021-05-02T18:43:49+05:30 IST

కరోనా నేపద్యంలో గతేడాదిగా..

‘వర్క్ ఫ్రమ్ హోం’తో... గూగుల్‌కు రూ. 7500 కోట్లు మిగులు

శాక్రిమెంటో(క్యాలిఫోర్నియా): కరోనా నేపద్యంలో గతేడాదిగా...  ప్రపంచవ్యాప్తంగా దిగ్గజ కంపెనీలు ‘వర్క్ ఫ్రమ్ హోమ్’ ఇస్తున్న విషయ తెలిసిందే. దీంతో ఉద్యోగులకు ప్రయాణ సమయం తప్పింది. కాగా... వర్క్ ఫ్రమ్ హోమ్ విధానం యాజమాన్యాలకు కూడా ఖర్చు తగ్గింది. కచ్చితంగా కార్యాలయాలున్న కంపెనీలు కూడా ఖర్చును తగ్గించుకునే క్రమంలో కార్యాలయాల సంఖ్యను తగ్గించాయి. 


వర్క్ ఫ్రమ్ హోమ్ కారణంగా తమకు ఏడాది కాలంలో దాదాపు రూ. 100 కోట్ల డాలర్లు ఆదా అయినట్లు గూగుల్ వెల్లడించింది. భారత కరెన్సీలో ఇది రూ. 7500 కోట్లు. ఈ ఏడాది తొలి త్రైమాసికం (జనవరి-మార్చి)లో కంపెనీ ప్రచారం, ఉద్యోగుల ప్రయాణాలు, వినోద ఖర్చులపై 26.8 కోట్ల డాలర్లు ఆదా చేసినట్లు గూగుల్ మాతృ సంస్థ ఆల్ఫాబెట్ వెల్లడించింది. ఈ క్రమంలో... ఏడాది పొడుగునా వర్క్ ఫ్రమ్ హోమ్ ట్రెండ్ కొనసాగినపక్షంలో... కంపెనీకి 100 కోట్ల డాలర్లకు పైగా తగ్గే అవకాశమున్నట్లు అంచనా. 


Updated Date - 2021-05-02T18:43:49+05:30 IST