ఆర్మీ ఏవియేషన్‌ వింగ్‌లో మహిళా పైలట్లు

ABN , First Publish Date - 2021-01-13T07:47:00+05:30 IST

భారత ఆర్మీ ఏవియేషన్‌ వింగ్‌లో పైలట్లుగా మహిళలనూ విధుల్లోకి తీసుకోనున్నారు. ఈ ఏడాది జూలైలో ఈ మేరకు మొదటి బ్యాచ్‌కు శిక్షణను ప్రారంభించే అవకాశం ఉంది.

ఆర్మీ ఏవియేషన్‌ వింగ్‌లో మహిళా పైలట్లు

న్యూఢిల్లీ, జనవరి 12: భారత ఆర్మీ ఏవియేషన్‌ వింగ్‌లో పైలట్లుగా మహిళలనూ విధుల్లోకి తీసుకోనున్నారు. ఈ ఏడాది జూలైలో ఈ మేరకు మొదటి బ్యాచ్‌కు శిక్షణను ప్రారంభించే అవకాశం ఉంది. భారత ఆర్మీ ఏవియేషన్‌ వింగ్‌లో ఈ మేరకు ఏర్పాట్లు చేసుకోవాలని తాను గత ఏడాది డిసెంబరులోనే సంబంధిత అధికారులకు సూచనలు చేశానని భారత సైన్యాధిపతి జనరల్‌ ఎంఎం నరవణె మంగళవారం మీడియాకు తెలిపారు. ఇప్పటివరకు ఆ వింగ్‌లో మహిళలను ఎయిర్‌ ట్రాఫిక్‌ కంట్రోల్‌, గ్రౌండ్‌ విధుల్లో మాత్రమే తీసుకునేవారు. 


Updated Date - 2021-01-13T07:47:00+05:30 IST