దేశంలో అతి తక్కువ కరోనా కేసుల నమోదు.. సరికొత్త రికార్డు

ABN , First Publish Date - 2021-06-22T15:52:57+05:30 IST

దేశంలో గత 24 గంటల్లో 42,640 కరోనా కేసులు నమోదయ్యాయి. మార్చి 19 నుంచి..

దేశంలో అతి తక్కువ కరోనా కేసుల నమోదు.. సరికొత్త రికార్డు

న్యూఢిల్లీ: దేశంలో గత 24 గంటల్లో 42,640 కరోనా కేసులు నమోదయ్యాయి. మార్చి 19 నుంచి (91 రోజుల్లో) ఇంత తక్కువ సంఖ్యలో కేసులు నమోదు కావడం ఇదే మొదటిసారి. 91,839 మందికి స్వస్థత చేకూరి డిశ్చార్జి కాగా, 1,167 మరణాలు చోటుచేసుకున్నట్టు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ మంగళవారం ప్రకటించింది. దేశంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 2,99,77,861కి చేరుకోగా, 2,89,26,038 మంది డిశ్చార్జి అయ్యారు. యాక్టివ్ కేసుల సంఖ్య 6,62,521గా ఉంది. మృతుల సంఖ్య 3,89,301 చేరింది. ఇంతవరకూ 28,87,66,201 మందికి వ్యాక్సినేషన్ ఇచ్చారు.

Updated Date - 2021-06-22T15:52:57+05:30 IST