రాజకీయాల్లో చేరే ప్రసక్తే లేదు: అనుపమ్ ఖేర్

ABN , First Publish Date - 2021-06-22T05:15:43+05:30 IST

తాను రాజకీయాల్లో చేరబోనని ప్రముఖ బాలీవుడ్ నటుడు అనుపమ్ ఖేర్ స్పష్టం చేశారు. ఇవాళ స్థానిక మీడియా ప్రతినిధులతో...

రాజకీయాల్లో చేరే ప్రసక్తే లేదు: అనుపమ్ ఖేర్

షిమ్లా: తాను రాజకీయాల్లో చేరబోనని ప్రముఖ బాలీవుడ్ నటుడు అనుపమ్ ఖేర్ స్పష్టం చేశారు. ఇవాళ స్థానిక మీడియా ప్రతినిధులతో మాట్లాడిన ఆయన.. తాను ‘‘రాజకీయాల్లో చేరే ప్రసక్తే లేదు..’’ అని తేల్చి చెప్పారు. 2017 హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీచేయడంపై మీడియా ప్రతినిధులు అడిగిన ఓ ప్రశ్నకు ఆయన స్పందిస్తూ.. ‘‘మీరు ఎవరికైనా షేక్ హ్యాండ్ ఇస్తే.. ప్రజలు వాళ్లకు ఆలోచనలకు అనుగుణంగా దాన్ని మల్చుకుని ఓ ముగింపునకు వచ్చేస్తారు..’’ అని పేర్కొన్నారు. వర్తమాన రాజకీయ పరిస్థితులపై తనదైన శైలిలో వ్యాఖ్యానించే ఖేర్.. రాజకీయాల్లో మాత్రం చేరబోనని పునరుద్ఘాటించారు. మరో ప్రశ్నకు ఆయన స్పందిస్తూ.. తన  భార్య కిరణ్ ఖేర్‌కు రాజకీయాల గురించి బాగా తెలుసునని అన్నారు. ఛండీగఢ్ నుంచి బీజేపీ ఎంపీగా కొనసాగుతున్న కిరణ్ ఖేర్.. ప్రస్తుతం బ్లడ్ కేన్సర్‌తో బాధపడుతున్నారు. కీమోథెరపీకి సంబంధించి ఆమెకు చాలా సైడ్ ఎఫెక్ట్స్ వచ్చాయనీ.. కానీ ఆమె ‘‘సంకల్ప బలం’’ మాత్రం గట్టిగా ఉందన్నారు. కొద్ది రోజులుగా తన స్వస్థలం షిమ్లాలో ఉంటున్న ఆయన.. బుధవారం తిరిగి ముంబై బయల్దేరి వెళ్లనున్నారు.

Updated Date - 2021-06-22T05:15:43+05:30 IST