ఎంపీగా కొనసాగుతా..
ABN , First Publish Date - 2021-08-03T07:13:56+05:30 IST
రాజకీయాలకు దూరంగా ఉంటూ.. ఎంపీగా రాజ్యాంగబద్ధ బాధ్యతలను నిర్వర్తిస్తానని కేంద్ర మాజీ
రాజకీయాలకు దూరంగా: బాబుల్ సుప్రియో
న్యూఢిల్లీ, ఆగస్టు 2: రాజకీయాలకు దూరంగా ఉంటూ.. ఎంపీగా రాజ్యాంగబద్ధ బాధ్యతలను నిర్వర్తిస్తానని కేంద్ర మాజీ మంత్రి, బీజేపీ ఎంపీ బాబుల్ సుప్రియో స్పష్టం చేశారు. జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాను కలిసిన తర్వాత.. రాజకీయాలకు స్వస్తి చెప్పాలన్న తన నిర్ణయాన్ని మార్చుకొన్నారు. ఇటీవల జరిగిన కేంద్ర కేబినెట్ పునర్వవస్థీకరణలో సహాయ మంత్రి పదవిని కోల్పోవడంతో ఆయన తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. సమాజసేవ చేయాలంటే రాజకీయాల్లో ఉండకూడదని.. అందుకే బయటకు వెళ్లిపోతున్నానని ట్వీట్ చేశారు. అయితే.. నడ్డాతో సమావేశం తర్వాత.. ఎంపీగా కొనసాగుతానని వెల్లడించారు.