అమెజాన్ అడవి అగ్ని ప్రమాదంలో 1.7 కోట్ల జంతువులు మృతి

ABN , First Publish Date - 2021-12-30T23:11:59+05:30 IST

వాతావరణ మార్పుల కారణంగా ఏర్పడ్డ ఈ దుర్ఘటనలో సరీసృపాలు, పక్షులు, ఇతర ప్రాణులు పెద్ద ఎత్తున ప్రాణాలు కోల్పోయాయి. డిసెంబర్ ప్రారంభంలో సైంటిఫిక్ రిపోర్ట్స్‌లో ప్రచురించబడిన ఒక అధ్యయనంలో, వివిధ పర్యావరణ వ్యవస్థలలో జీవవైవిధ్య..

అమెజాన్ అడవి అగ్ని ప్రమాదంలో 1.7 కోట్ల జంతువులు మృతి

బ్రెసీలియా: పోయిన ఏడాది అమెజాన్ అడవుల్లో చెలరేగిన మంటల్లో సుమారు 1.7 కోట్ల జంతువులు చనిపోయాయని తాజా అధ్యయనం ఒకటి తేల్చి చెప్పింది. ఇవి కేవలం బ్రెజిల్ పరిధిలో చోటు చేసుకున్న మరణాలు మాత్రమేనని అధ్యయనం పేర్కొంది. 2020లో అమెజాన్ అడవిలోని అగ్నికిలల్లో చిక్కుకుని మరణించిన ప్రాణుల సంఖ్యను లెక్కించడానికి శాస్త్రవేత్తలు ఇంకా ప్రయత్నించారు. అయితే ఈ ప్రమాదానికి వాతావరణ మార్పే ప్రధాన కారణమని శాస్త్రవేత్తలు అంటున్నారు. మనిషి చేస్తున్న అనేక చర్యల వల్ల వాతావరణంలో మార్పులు వస్తున్నాయని కొద్ది రోజుల క్రితం ఫ్రాన్స్‌లో జరిగిన అంతర్జాతీయ వాతావరణ సమ్మేళనంలో ప్రముఖులు అభిప్రాయపడ్డారు.


వాతావరణ మార్పుల కారణంగా ఏర్పడ్డ ఈ దుర్ఘటనలో సరీసృపాలు, పక్షులు, ఇతర ప్రాణులు పెద్ద ఎత్తున ప్రాణాలు కోల్పోయాయి. డిసెంబర్ ప్రారంభంలో సైంటిఫిక్ రిపోర్ట్స్‌లో ప్రచురించబడిన ఒక అధ్యయనంలో, వివిధ పర్యావరణ వ్యవస్థలలో జీవవైవిధ్య ఫలితాలను నిర్ణయించడంలో అగ్ని పాత్ర ఉందని పేర్కొన్నారు. అయితే అడవుల్లో ఉండే ప్రాణులకు ఇదే అగ్ని పెద్ద విపత్తుగా పరిణమించింది. అమెజాన్‌తో పాటు ఆస్ట్రేలియాలోని అడవుల్లో జరిగిన అగ్ని ప్రమాదంలో సైతం వేల కొద్ది ప్రాణులు మరణించాయి. అమెజాన్ అడవిలోని 39,030 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలోని ప్రాంతం అగ్నికి గురైంది.

Updated Date - 2021-12-30T23:11:59+05:30 IST