యూపీ సీఎం ఎవరో బీజేపీ అధిష్ఠానం నిర్ణయిస్తుంది

ABN , First Publish Date - 2021-06-22T07:23:31+05:30 IST

ఉత్తరప్రదేశ్‌ తదుపరి ముఖ్యమంత్రి ఎవరన్న విషయాన్ని కొన్ని నెలల్లో జరగనున్న అసెంబ్లీ

యూపీ సీఎం ఎవరో  బీజేపీ అధిష్ఠానం నిర్ణయిస్తుంది

మంత్రి స్వామి ప్రసాద్‌ మౌర్య 

లఖ్‌నవూ, జూన్‌ 21: ఉత్తరప్రదేశ్‌ తదుపరి ముఖ్యమంత్రి ఎవరన్న విషయాన్ని కొన్ని నెలల్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల తర్వాత తాము గెలిచాక బీజేపీ జాతీయ నాయకత్వం నిర్ణయిస్తుందని ఆ రాష్ట్ర మంత్రి స్వామి ప్రసాద్‌ మౌర్య అన్నారు. బీజేపీ యూపీ ప్రధాన కార్యాలయం వద్ద మీడియాతో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఎన్నికల్లో కూడా యోగి ఆదిత్యనాథే తమ పార్టీ సీఎం అభ్యర్థి అని ఇటీవలే  పలువురు బీజేపీ నేతలు అన్నారు. అందుకు భిన్నంగా స్వామి ప్రసాద్‌ మౌర్య వ్యాఖ్యానించడం గమనార్హం. 


Updated Date - 2021-06-22T07:23:31+05:30 IST