కరోనా చికిత్స.. డబ్ల్యూహెచ్ఓ కీలక సూచన!

ABN , First Publish Date - 2021-01-27T02:18:38+05:30 IST

కరోనా పేషెంట్ల చికిత్సకు సంబంధించి ప్రపంచ ఆరోగ్య సంస్థ తాజాగా కొన్ని కీలక సూచనలు చేసింది. ఇంట్లో చికిత్స పొందే వారు తమ వద్ద తప్పని సరిగా పల్స్ ఆక్సీ మీటర్ పెట్టుకోవాలని సూచించింది.

కరోనా చికిత్స.. డబ్ల్యూహెచ్ఓ కీలక సూచన!

వాషింగ్టన్: కరోనా పేషెంట్ల చికిత్సకు సంబంధించి ప్రపంచ ఆరోగ్య సంస్థ తాజాగా కొన్ని కీలక సూచనలు చేసింది. ఇంట్లో చికిత్స పొందే వారు తమ వద్ద తప్పని సరిగా పల్స్ ఆక్సీ మీటర్ పెట్టుకోవాలని సూచించింది. అంతేకాకుండా.. కరోనా నుంచి కోలుకున్నా పూర్తి స్వస్థత చేకూరని రోగుల్లో రక్తాన్ని పలుచన చేసే యాంటీ కోయాగ్యులెంట్స్ వినియోగించాలని సూచించింది. రక్తం గడ్డకట్టకుండా ఉండేందుకు ఈ సూచన చేసింది. అయితే.. వీటిని చాలా తక్కువ మోతాదులో తీసుకోవాలని స్పష్టం చేసింది. ఈ మేరకు ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రతినిధి మార్గరేట్ హ్యారిస్ ఓ కీలక ప్రకటన చేశారు. అయితే.. వ్యాక్సిన్ విడుదల విషయంలో ఐరోపాలో జరుగుతున్న జాప్యంపై స్పందించేందుకు ఆమె నిరాకరించారు. దీనిపై తమకు పూర్తి సమాచారం లేదని ఆమె స్పష్టం చేశారు. వ్యాక్సినేషన్ ప్రారంభమైన తొలి వంద రోజుల్లో వివిధ దేశాల్లోని ఆరోగ్య సిబ్బంది అందరికీ టీకా అందాలనేదే తమ లక్ష్యమని ఆమె తెలిపారు.

Updated Date - 2021-01-27T02:18:38+05:30 IST