వైరస్‌ పుట్టిందెక్కడ?

ABN , First Publish Date - 2021-02-01T07:06:25+05:30 IST

కరోనా వైరస్‌ పుట్టుకకు సంబంధించిన సమాచారాన్ని సేకరించేందుకు ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) నిపుణుల బృందం చైనాలోని వూహాన్‌లో ఆదివారం పర్యటించింది.

వైరస్‌ పుట్టిందెక్కడ?

వూహాన్‌ మాంసం మార్కెట్‌ను సందర్శించిన డబ్ల్యూహెచ్‌వో నిపుణులు


వూహాన్‌, జనవరి 31 : కరోనా వైరస్‌ పుట్టుకకు సంబంధించిన సమాచారాన్ని సేకరించేందుకు ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) నిపుణుల బృందం చైనాలోని వూహాన్‌లో ఆదివారం పర్యటించింది. నగరంలోని అతిపెద్ద మాంసం మార్కెట్లలో ఒకటైన ‘బైషాజౌ’తో పాటు వూహాన్‌ జిన్‌యింటన్‌ ఆస్పత్రి, హుబీ ఇంటిగ్రేటెడ్‌ చైనీస్‌ అండ్‌ వెస్టెర్న్‌ మెడిసిన్‌ హాస్పిటల్‌లను బృందం సభ్యులు సందర్శించారు. అంతకుముందు రోజు (శనివారం) కొవిడ్‌-19 వైరస్‌ పుట్టుకకు సంబంధించిన సమాచారంతో వూహాన్‌లో ప్రత్యేకంగా ఏర్పాటుచేసిన మ్యూజియాన్ని కూడా పరిశీలించారు. కరోనా వైరస్‌ లీకైనట్లుగా ఆరోపణలు ఎదుర్కొంటున్న వూహాన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ వైరాలజీని కూడా త్వరలోనే తమ బృందం తనిఖీ చేస్తుందని గత గురువారమే ట్విటర్‌ వేదికగా డబ్ల్యూహెచ్‌వో ప్రకటించింది. 

Updated Date - 2021-02-01T07:06:25+05:30 IST