వెనక్కి తగ్గిన వాట్సాప్‌..

ABN , First Publish Date - 2021-05-08T09:37:18+05:30 IST

వాట్సాప్‌ వెనక్కి తగ్గింది. వివాదాస్పద గోప్యతా విధాన నిబంధనలను వాట్సాప్‌ యూజర్లు మే 15 వరకు అంగీకరించాలన్న గడువును ఎత్తివేసింది. ఈ నిబంధనలను అంగీకరించకపోయినప్పటికీ ఖాతాల తొలగింపు ఉండబోదని పేర్కొంది. వాట్సాప్‌ విధానంపై పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తిన

వెనక్కి తగ్గిన వాట్సాప్‌..

నిబంధనలు అంగీకరించకున్నా ఖాతాల కొనసాగింపు 


న్యూఢిల్లీ, మే 7: వాట్సాప్‌ వెనక్కి తగ్గింది. వివాదాస్పద గోప్యతా విధాన నిబంధనలను వాట్సాప్‌ యూజర్లు మే 15 వరకు అంగీకరించాలన్న గడువును ఎత్తివేసింది. ఈ నిబంధనలను అంగీకరించకపోయినప్పటికీ ఖాతాల తొలగింపు ఉండబోదని పేర్కొంది. వాట్సాప్‌ విధానంపై పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తిన నేపథ్యంలో వెనక్కి తగ్గినట్టు తెలుస్తోంది. కాగా పాలసీ అప్‌డేట్‌ను గడువునాటికి అంగీకరించకపోయినా ఖాతాల తొలగింపు ఉండబోదని వాట్సాప్‌ అధికార ప్రతినిధి ఒకరు శుక్రవారం తెలిపారు. అయితే సర్వీసులకు సంబంధించిన కొత్త నిబంధనలను పొందిన వినియోగదారుల్లో చాలా మంది అంగీకరించినట్టు చెప్పారు.  కొంత మంది మాత్రం అంగీకారం తెలపలేదన్నారు. కాగా తాజాగా తీసుకున్న నిర్ణయానికి కారణాలను మాత్రం వాట్సాప్‌ వెల్లడించలేదు. ఇప్పటి వరకు నూతన పాలసీని ఎంత మంది ఆమోదించినది కూడా తెలియజేయలేదు.

Updated Date - 2021-05-08T09:37:18+05:30 IST