పశ్చిమ బెంగాల్ గవర్నర్ జగదీప్ ధనకర్‌కు మలేరియా.. ఎయిమ్స్‌లో చేరిక
ABN , First Publish Date - 2021-10-26T02:17:32+05:30 IST
పశ్చిమ బెంగాల్ గవర్నర్ జగదీప్ ధన్కర్ మలేరియాతో ఢిల్లీలోని ఎయిమ్స్ ఆసుపత్రిలో చేరారు

న్యూఢిల్లీ: పశ్చిమ బెంగాల్ గవర్నర్ జగదీప్ ధన్కర్ మలేరియాతో ఢిల్లీలోని ఎయిమ్స్ ఆసుపత్రిలో చేరారు. గవర్నర్‌కు ఇటీవల తీవ్ర జ్వరం రావడంతో రక్త పరీక్షలు చేయించారు. ఈ పరీక్షల్లో ఆయనకు మలేరియా సోకినట్టు తాజాగా వచ్చిన రిపోర్టుల్లో నిర్ధారణ అయింది. దీంతో కుటుంబ సభ్యులు వెంటనే ఆయనను నిమ్స్‌కు తరలించారు. మధ్యాహ్నం మూడు గంటల సమయంలో ఆసుపత్రిలో చేర్పించారు. ధన్కర్ ప్రస్తుతం ప్రధాన ఎయిమ్స్‌లోని పాత ప్రైవేటు వార్డులో చికిత్స పొందుతున్నారు. ఆసుపత్రి మెడికల్ డిపార్ట్మెంట్ అదనపు ప్రొఫెసర్ డాక్టర్ నిశ్చల్ పర్యవేక్షణలో గవర్నర్ చికిత్స పొందుతున్నారు.