పశ్చిమ బెంగాల్లో హోరాహోరీ.. ప్రస్తుతం ఏ పార్టీ ఎన్ని సీట్లలో ఆధిక్యంలో ఉన్నాయంటే..

ABN , First Publish Date - 2021-05-02T14:46:20+05:30 IST

పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఉత్కంఠను రేపుతున్నాయి. దేశ వ్యాప్తంగా ప్రజలంతా ఆ రాష్ట్రంలో ఎలాంటి ఫలితం వస్తుందన్న ఆసక్తిని కనపరుస్తున్నారు.

పశ్చిమ బెంగాల్లో హోరాహోరీ.. ప్రస్తుతం ఏ పార్టీ ఎన్ని సీట్లలో ఆధిక్యంలో ఉన్నాయంటే..

పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఉత్కంఠను రేపుతున్నాయి. దేశ వ్యాప్తంగా ప్రజలంతా ఆ రాష్ట్రంలో ఎలాంటి ఫలితం వస్తుందన్న ఆసక్తిని కనపరుస్తున్నారు. ఎన్నికల ప్రచారంలో అధికార టీఎంసీ, ప్రతిపక్ష బీజేపీ హోరాహోరీగా తలపడిన సంగతి తెలిసిందే. తాజాగా ఎన్నికల ఫలితాల్లోనూ అదే సీన్ రిపీట్ అవుతోంది. హోరాహోరీగా పోటీ నడుస్తోందన్న ట్రెండ్స్ కనిపిస్తున్నాయి. ఉదయం 8 గంటలకే ఎన్నికల కౌంటింగ్ ప్రారంభమయింది. 9 గంటల సమయానికి అందిన సమాచారం ప్రకారం మమతాబెనర్జీ పార్టీ 84 స్థానాల్లో ఆధిక్యంలో దూసుకెళ్తోంది. అదే సమయంలో భారతీయ జనతాపార్టీ కూడా పోటీని ఇస్తోంది. ఆ పార్టీకి 80 స్థానాల్లో ఆధిక్యం ఉంది. వామపక్ష పార్టీ రెండు స్థానాల్లో ఆధిక్యంలో ఉండగా, ఇంకా 128 స్థానాల్లో సమాచారం రావాల్సి ఉంది. కాగా, పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో మరోసారి మమతాబెనర్జీయే అధికారంలోకి వస్తారని మెజార్టీ ఎగ్జిట్ పోల్స్ తేల్చిచెప్పాయి. మరి ఆ ఎగ్జిట్ పోల్స్ నిజమవుతాయో.. లేదో అన్నది మరికొద్ది గంటల్లోనే తేలుతుంది

Updated Date - 2021-05-02T14:46:20+05:30 IST