సీఎం మమతా బెనర్జీ తమ్ముడు కరోనాతో మృతి

ABN , First Publish Date - 2021-05-15T17:31:30+05:30 IST

పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తమ్ముడు అషీమ్ బెనర్జీ శనివారం కరోనా కారణంగా మరణించారు....

సీఎం మమతా బెనర్జీ తమ్ముడు కరోనాతో మృతి

 కోల్‌కతా (పశ్చిమబెంగాల్):  పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తమ్ముడు అషీమ్ బెనర్జీ శనివారం కరోనా కారణంగా మరణించారు. అషీమ్ బెనర్జీకి కరోనా సోకడంతో అతన్ని కోల్‌కతాలోని మెడికా ఆసుపత్రిలో చేర్చి వైద్యులు చికిత్స అందిస్తున్నారు. కరోనా చికిత్స పొందుతున్న అషీమ్ బెనర్జీ పరిస్థితి విషమించడంతో శనివారం మరణించారు. పశ్చిమబెంగాల్ రాష్ట్రంలో శుక్రవారం అత్యధికంగా 20,846 కరోనా కేసులు నమోదు కావడంతో మొత్తం కేసుల సంఖ్య 10,94,802కు పెరిగాయి. శుక్రవారం ఒక్కరోజే కరోనాతో 136 మంది మరణించారు. దీంతో పశ్చిమబెంగాల్ లో మొత్తం కరోనా మరణాల సంఖ్య 12,993కు పెరిగాయి.

Updated Date - 2021-05-15T17:31:30+05:30 IST