సంక్షేమ సహాయాల పంపిణీ
ABN , First Publish Date - 2021-10-29T13:53:35+05:30 IST
కొత్తగా ఎంపికైన ప్రజా ప్రతి నిధుల పరిచయ కార్యక్రమం గురువారం రాణిపేట జిల్లా షోలింగర్‌లో జరిగింది. కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ భాస్కర పాండియన్ అధ్యక్షత వహించగా, ముఖ్యఅతిథిగా చేనేత శాఖ మంత్రి

వేలూరు(Chennai): కొత్తగా ఎంపికైన ప్రజాప్రతినిధుల పరిచయ కార్యక్రమం గురువారం రాణిపేట జిల్లా షోలింగర్‌లో జరిగింది. కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ భాస్కర పాండియన్ అధ్యక్షత వహించగా, ముఖ్యఅతిథిగా చేనేత శాఖ మంత్రి గాంధీ పాల్గొని, ప్రజా ప్రతినిధుల విధులు, సమావేశాల నియమ నిబంధనలు తదితరాలను వివరించారు. అనంతరం పలువురు లబ్ధ్దిదారులకు మంత్రి సంక్షేమ సహాయాలు అందజేశారు. కార్యక్రమంలో అరక్కోణం ఎంపీ జగద్రక్షకన్, షోలింగర్ ఎమ్మెల్యే మునిరత్నం, ఆర్కాడు ఎమ్మెల్యే ఈశ్వరప్పన్, యూనియన్ కమిటీ అధ్యక్షుడు కలైకుమార్, జిల్లా పంచాయితీ కమిటీ ఉపాధ్యక్షుడు నాగరాజ్ పాల్గొన్నారు.