న్యాయపరమైన పాలన పునరుద్ధరిస్తాం

ABN , First Publish Date - 2021-03-22T07:00:19+05:30 IST

పశ్చిమ బెంగాల్‌లో న్యాయమైన పాలనను పునరుద్ధరిస్తామని సీపీఎం ఆధ్వర్యంలోని వామపక్ష ఫ్రంట్‌ పేర్కొంది.

న్యాయపరమైన పాలన పునరుద్ధరిస్తాం

 బెంగాల్‌లో వామపక్ష ఫ్రంట్‌ మేనిఫేస్టో విడుదల 


కోల్‌కతా, మార్చి 21: పశ్చిమ బెంగాల్‌లో న్యాయమైన పాలనను పునరుద్ధరిస్తామని సీపీఎం ఆధ్వర్యంలోని వామపక్ష ఫ్రంట్‌ పేర్కొంది. తాము అధికారంలోకి వస్తే సీఏఏ, ఎన్‌ఆర్సీ చట్టాలను రాష్ట్రంలో అమలు కాకుండా చూస్తామని స్పష్టం చేసింది. ఈ మేరకు లెఫ్ట్‌ఫ్రంట్‌, ఆ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల కోసం తమ మేనిఫేస్టోను విడుదల చేసింది. సీపీఎం రాష్ట్ర కార్యాలయంలో లెఫ్ట్‌ ఫ్రంట్‌ చైర్మన్‌ బిమన్‌ బోస్‌ ఈ మేనిఫేస్టోను విడుదల చేశారు. లౌకికవాద సూత్రాలకు కట్టుబడి ఉంటామని, ముస్లింలు సహా భాష, మతపరమైన మైనారిటీల భద్రతకు కట్టుబడి ఉంటామని మేనిఫేస్టోలో ప్రతిన బూనారు. సహకార, పరిశ్రమలు, వ్యవసాయ రంగాల్లో ఉద్యోగ, ఉపాధి కల్పనకు ప్రాధాన్యమిస్తామని పేర్కొన్నారు. ప్రాఽథమిక, మాధ్యమిక, ఉన్నత పాఠశాలలో టీచర్‌ పోస్టులను భర్తీ చేస్తామని, వంద రోజుల ఉపాధి పథకాన్ని గ్రామీణ ప్రాంతాల నుంచి పట్టణ ప్రాంతాలకు విస్తరిస్తామని తెలిపారు. 


Updated Date - 2021-03-22T07:00:19+05:30 IST