రిజర్వేషన్లు సాధించే వరకు పోరాటం చేస్తాం: ఉద్ధవ్ థాకరే

ABN , First Publish Date - 2021-05-05T20:49:02+05:30 IST

మరాఠా సమాజ ఆత్మగౌరవం కోసం రాష్ట్ర అసెంబ్లీ ఏకగ్రీవంగా ఈ చట్టాన్ని ఆమోదించిందని అన్నారు. అయితే ప్రధానికి రాష్ట్రపతికి మాత్రమే ఇలాంటి చట్టాలు చేసే అధికారం ఉందని..

రిజర్వేషన్లు సాధించే వరకు పోరాటం చేస్తాం: ఉద్ధవ్ థాకరే

ముంబై: మరాఠాలకు రిజర్వేషన్లు కల్పించే చట్టాన్ని దేశ అత్యున్నత న్యాయస్థానం రద్దు చేయడంపై మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరే అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ విషయమై బుధవారం ముంబైలో తన కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ మరాఠా సమాజ ఆత్మగౌరవం కోసం రాష్ట్ర అసెంబ్లీ ఏకగ్రీవంగా ఈ చట్టాన్ని ఆమోదించిందని అన్నారు. అయితే ప్రధానికి రాష్ట్రపతికి మాత్రమే ఇలాంటి చట్టాలు చేసే అధికారం ఉందని, మహారాష్ట్రకు అధికారం లేదని సుప్రీం వ్యాఖ్యానించినట్లు ఉద్ధవ్ ప్రస్తావించారు.


‘‘మహారాష్ట్రలో మరాఠా సమాజానికి రిజర్వేషన్లు కల్పించే చట్టాన్ని సుప్రీంకోర్టు రద్దు చేసింది. మరాఠా సమాజ ఆత్మగౌరవం కోసం రాష్ట్ర అసెంబ్లీ ఏకగ్రీవ తీర్మాణం ద్వారా ప్రత్యేక రిజర్వేషన్ల చట్టాన్ని తీసుకువచ్చింది. అయితే ఈ చట్టం చేసే అధికారం మహారాష్ట్రకు లేదని సుప్రీం చెప్పింది. కేవలం ప్రధానమంత్రి, రాష్ట్రపతి మాత్రమే చేయగలరట. మరాఠాలకు రిజర్వేషన్లు కల్పించే చట్టం కోసం ప్రధానిని అభ్యర్ధిస్తాం. ఇప్పటికే మరాఠా రిజర్వేషన్ల కోసం శంభాజీ రాజేను నియమించాం. కానీ ప్రధాని నుంచి అపాయింట్‌మెంట్ లభించడం లేదు. ప్రధాని ఎందుకు అపాయింట్‌మెంట్ ఇవ్వడం లేదో అర్థం కావడం లేదు. ఎన్ని ఒడిదుడుకులు ఎదురైనా మా పోరాటం ఆపబోం. మరాఠాలకు రిజర్వేషన్లు సాధించే వరకు చట్టబద్ధమైన పోరాటం కొనసాగిస్తాం’’ అని ఉద్ధవ్ థాకరే అన్నారు.

Updated Date - 2021-05-05T20:49:02+05:30 IST