మనం ఈలాన్ మస్క్‌ను చూసి నేర్చుకోవాలి: మాజీ ఇస్రో చీఫ్

ABN , First Publish Date - 2021-03-22T02:14:56+05:30 IST

భారత్ అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో మాజీ చైర్మన్ జీ మాధవన్ నాయర్ స్పెస్ ఎక్స్ వ్యవస్థాపకుడు ఈలాన్ మస్క్‌పై తాజాగా ప్రశంసల వర్షం కురిపించారు.

మనం ఈలాన్ మస్క్‌ను చూసి నేర్చుకోవాలి: మాజీ ఇస్రో చీఫ్

న్యూడిల్లీ: భారత్ అంతరిక్ష పరిశోధన సంస్థ(ఇస్రో) మాజీ చైర్మన్ జీ మాధవన్ నాయర్ స్పెస్ ఎక్స్ వ్యవస్థాపకుడు ఈలాన్ మస్క్‌పై తాజాగా ప్రశంసల వర్షం కురిపించారు. రాకెట్లకు పునర్వియోగానికి సంబంధించి టెక్నాలజీలో ఈలాన్ మస్క్ విప్లవాత్వక మార్పులు తీసుకొచ్చారని వ్యాఖ్యానించారు. అంతేకాకుండా.. ఈ టెక్నాలజీకి సంబంధించినంతవరకూ స్సెక్స్ నుంచి బారత్ నేర్చుకోవాలని కూడా సూచించారు. మస్క్ వృతిపరమైన జీవితాన్ని చూస్తుంటే తన కెరిర్ ఆరంభంనాటి రోజులు గుర్తుకొస్తున్నాయని కూడా ఆయన తెలిపారు. ఆ సమయంలో.. భారత్ అంతరిక్ష పరిశోధనల పితామహుడు విక్రమ్ సారాభాయ్ కొత్త తరాన్నీ ప్రోత్సహించే వారని.. గొప్ప కలలు కనాలంటూ వారిలో స్ఫూర్తి నింపే ప్రయత్నం చేసేవారంటూ నాటి రోజులను గుర్తు చేసుకున్నారు. 


Updated Date - 2021-03-22T02:14:56+05:30 IST