అదే ఆశిస్తున్నా: అస్సాం-మిజోరాం ఉద్రిక్తతపై అస్సాం సీఎం

ABN , First Publish Date - 2021-08-10T21:19:15+05:30 IST

అదే ఆశిస్తున్నా: అస్సాం-మిజోరాం ఉద్రిక్తతపై అస్సాం సీఎం

అదే ఆశిస్తున్నా: అస్సాం-మిజోరాం ఉద్రిక్తతపై అస్సాం సీఎం

గువహాటి: కొద్ది రోజులుగా అస్సాం-మిజోరాం మధ్య తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్నాయి. ఇరు రాష్ట్రాల సరిహద్దు వద్దు పోలీసు పహారాలు, పౌరుల మధ్య గొడవలు ఇరు రాష్ట్రాల్ని కుదిపివేస్తున్నాయి. అయితే ఈ సమస్యకు తొందరలోనే పరిష్కారం దొరకాలని, ఇందుకు ఇరు రాష్ట్రాల మధ్య శాంతియుత చర్చలు జరుగుతాయని ఆశిస్తున్నట్లు మంగళవారం రాజధాని డిస్పూర్‌లో నిర్వహించిన ప్రెస్‌మీట్‌లో ముఖ్యమంత్రి హిమంత్ బిశ్వా శర్మ అన్నారు.


‘‘ఇరు వైపుల నుంచి ఉద్రిక్తతలు కొంత కాలంగా తీవ్రంగా ఉన్నాయి. ఈ గాయాలు మానాలంటే కొంత సమయం పడుతుంది. మాతో పాటు మిజోరాంకు కూడా ప్రశాంతత అవసరం. దీనికి పరిష్కారం దొరకాలంటే ఇరు వైపుల నుంచి విశ్వాసం పొందే చర్యలు ప్రారంభం కావాలి. కొన్ని తీర్మానాలు కూడా తప్పనిసరి. ఇరు రాష్ట్రాల ప్రభుత్వాలు దీనిపై చర్చలు చేస్తాయని నేను అనుకుంటున్నాను. ఇరు రాష్ట్రాలు శాంతి, ప్రశాంతత కోసం పని చేస్తాయని ఆశిస్తున్నాను’’ అని హిమంత్ బిశ్వా శర్మ అన్నారు.

Updated Date - 2021-08-10T21:19:15+05:30 IST