ఇంకా సాధించలేదు: దేశ అభివృద్ధిపై ఆర్ఎస్ఎస్ చీఫ్

ABN , First Publish Date - 2021-11-22T01:46:49+05:30 IST

మన దేశం అనుకున్న ప్రగతిని ఇంకా సాధించలేదని రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) చీఫ్ మోహన్ భాగవత్ అన్నారు. వెళ్లాల్సిన దారిలో వెళ్తే అనుకున్న ఫలితాలు సాధించగలమని ఆయన అన్నారు. ఆదివారం ఢిల్లీలో జరిగిన సంత్ ఈశ్వర్..

ఇంకా సాధించలేదు: దేశ అభివృద్ధిపై ఆర్ఎస్ఎస్ చీఫ్

న్యూఢిల్లీ: మన దేశం అనుకున్న ప్రగతిని ఇంకా సాధించలేదని రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) చీఫ్ మోహన్ భాగవత్ అన్నారు. వెళ్లాల్సిన దారిలో వెళ్తే అనుకున్న ఫలితాలు సాధించగలమని ఆయన అన్నారు. ఆదివారం ఢిల్లీలో జరిగిన సంత్ ఈశ్వర్ సమ్మాన్-2021 కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆయన.. స్వాతంత్ర్యానంతర 75 ఏళ్ల స్వపాలనపై అసంతృప్తిని వ్యక్తం చేశారు. ‘‘ఈ 75 ఏళ్లలో మనం అనుకున్నంతగా అభివృద్ధి చెందలేదు. దేశాన్ని ముందుకు తీసుకువెళ్లే బాటలో తీసుకెళ్తే అనుకున్న ఫలితాలు వస్తాయి. ఆ మార్గంలో వెళ్లకపోతే మనం ముందుకు వెళ్లలేం’’ అని అన్నారు. ఇక ఆయన దేశం గొప్పతనం గురించి వివరిస్తూ ప్రపంచంలో మహాపురుషులు ఎందరు ఉన్నారో ఈ 200 ఏళ్లలో మన దేశంలో అంత మంది మహాపురుషులు ఉద్భవించారని, ఒక్కొక్కరి జీవితం సర్వతోముఖ జీవితానికి మార్గం చూపుతుందని అన్నారు. సత్ మార్గంలో వెళ్లనిప్పుడు తప్పకుండా విజయాలు సాధిస్తామని, శకునాలు ఉండవని మోహన్ భాగవత్ అన్నారు.

Updated Date - 2021-11-22T01:46:49+05:30 IST