తాలిబన్లకు బలైన మహిళా Volleyball ప్లేయర్

ABN , First Publish Date - 2021-10-20T22:01:45+05:30 IST

ఈ నెలలోనే మహబజిన్ హకీమి అనే క్రీడాకారిణిని తాలిబన్లు కిరాతంగా చంపేశారు. ఆమె తల నరికి దూరంగా విసిరేశారు. అయితే వాళ్లు ఎందుకు ఇలా చేశారనే విషయాన్ని ఆమె కోచ్ వెల్లడించలేదు. ఈ విషయాన్ని బయటికి చెప్పకూడదని మహబజిన్ కుటుంబాన్ని బెదిరించారట. అందుకే ఈ విషయం బయటికి వెళ్లడి కాలేదని కోచ్ పేర్కొన్నారు..

తాలిబన్లకు బలైన మహిళా Volleyball ప్లేయర్

కాబూల్: తాలిబన్ల ఆధిపత్యంలోకి వచ్చాక అఫ్ఘాన్ పరిస్థితి రోజు రోజుకూ మరింత దయనీయంగా మారుతోంది. ముఖ్యంగా ఆడవారి విషయంలో అయితే అనేక ఆంక్షలు, కట్టుబట్లు అమలు చేస్తూ వ్యక్తిగత, సామాజిక స్వేచ్ఛను హరిస్తున్నారు. ఇక అఫ్ఘాన్‌లో జరుగుతున్న మానవహననం గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. తాజాగా అఫ్ఘాన్‌కు చెందిన జాతీయ మహిళా వాలీబాల్ క్రీడాకరిణి తల నరికి చంపిన ఘటన ప్రపంచాన్ని దిగ్భ్రాంతిలోకి నెట్టింది. ఆమె కోచ్ ఓ ఇంటర్వ్యూలో వెల్లడించే వరకు ఈ విషయం బయటి సమాజానికి తెలియదు. ఈ లెక్కన బయటికి వెళ్లడి కాకుండా జరుగుతున్న మానవహననం గురించి ఎంత చెప్పినా తక్కువే.


ఈ నెలలోనే మహబజిన్ హకీమి అనే క్రీడాకారిణిని తాలిబన్లు కిరాతంగా చంపేశారు. ఆమె తల నరికి దూరంగా విసిరేశారు. అయితే వాళ్లు ఎందుకు ఇలా చేశారనే విషయాన్ని ఆమె కోచ్ వెల్లడించలేదు. ఈ విషయాన్ని బయటికి చెప్పకూడదని మహబజిన్ కుటుంబాన్ని బెదిరించారట. అందుకే ఈ విషయం బయటికి వెళ్లడి కాలేదని కోచ్ పేర్కొన్నారు. మహబజిన్ అష్రఫ్ ఘనీ ప్రభుత్వం పతనానికి ముందు కాబూల్ మునిసిపాలిటీ వాలీబాల్ క్లబ్ తరపున హకీమి ఆడేదని పైగా  క్లబ్ స్టార్ ఆటగాళ్లలో ఆమె ఒకరని, ఆగష్టులో తాలిబన్లు పూర్తి నియంత్రణ తీసుకోవడానికి ముందు జట్టులోని ఇద్దరు క్రీడాకారులు మాత్రమే దేశం నుంచి తప్పించుకోగలిగారని కోచ్ తెలిపారు.

Updated Date - 2021-10-20T22:01:45+05:30 IST