జ్వరంతో బాధపడుతున్న శశికళ.. ఆసుపత్రికి తరలింపు
ABN , First Publish Date - 2021-01-21T00:18:16+05:30 IST
ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో జైలు శిక్ష అనుభవిస్తున్న జయలలిత నిచ్చెలి శశికళ జ్వరంతో బాధపడుతుండటంతో ఆమెను బెంగళూరులోని...

బెంగళూరు జైలులో ఉన్న శశికళకు అనారోగ్యం.. ఆసుపత్రికి తరలింపు
చెన్నై: ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో జైలు శిక్ష అనుభవిస్తున్న జయలలిత నిచ్చెలి శశికళ జ్వరంతో బాధపడుతుండటంతో ఆమెను బెంగళూరులోని బౌరింగ్ అండ్ లేడీ కర్జన్ ఆసుపత్రికి తరలించారు. వైద్యులు శశికళకు కోవిడ్-19 టెస్ట్‌తో పాటు పలు వైద్య పరీక్షలు చేశారు. మరికొన్ని రోజుల్లోనే శశికళ జైలు నుంచి విడుదల కానుండటం గమనార్హం. ఈ క్రమంలో ఆమె అనారోగ్యానికి లోను కావడంతో అనుచరులు ఆందోళన చెందుతున్నారు. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు మరికొన్ని నెలల్లో నిర్వహించాల్సి ఉండటంతో.. జైలు నుంచి విడుదలయ్యాక శశికళ తీసుకునే నిర్ణయంపై ఉత్కంఠ నెలకొంది. ఆమెను తిరిగి అన్నాడీఎంకేలో చేర్చుకునే అవకాశమే లేదని ఇప్పటికే సీఎం పళనిస్వామి స్పష్టమైన ప్రకటన చేశారు. దీంతో.. ఆమె సొంతంగా పార్టీని నెలకొల్పే అవకాశాలున్నాయని తమిళ రాజకీయాల్లో జోరుగా చర్చ జరుగుతోంది.