అభివృద్ధి 140% పెరిగింది: రాహుల్ సెటైర్లు

ABN , First Publish Date - 2021-11-24T01:49:07+05:30 IST

ఇక కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ సైతం విమర్శలు గుప్పించారు. ‘‘మోదీ పాలనలో విలువైనవి ఎప్పుడూ మరింత విలువైనవిగానే మారిపోతుంటాయి. అధిక ద్రవ్యోల్బణం తగ్గుందని నినాదం ఇచ్చిన వారే ప్రజలు పెరిగిన ధరల గురించి మాట్లాడితే..

అభివృద్ధి 140% పెరిగింది: రాహుల్ సెటైర్లు

న్యూఢిల్లీ: ఎన్నికల ప్రచారంలో నరేంద్రమోదీ తరుచూ చెప్పే ‘వికాస్’ (అభివృద్ధి) మంత్రంపై కాంగ్రెస్ కీలక నేత రాహుల్ గాంధీ సెటైర్లు గుప్పించారు. జీఎస్టీ 140 శాతం అభివృద్ధి సాధించిందని బట్టలపై, ఇతర గూడ్స్ పరికరాలపై పెరిగిన జీఎస్టీ ధరలను ఉద్దేశిస్తూ రాహుల్ చెప్పుకొచ్చారు. ఈ అచ్చేదిన్ (మంచి రోజులు) కొనసాగుతూనే ఉన్నాయని చెప్పుకొచ్చిన ఆయన ప్రభుత్వ విధానాల్ని ‘లూట్’ అంటూ వ్యాఖ్యానించారు. మంగళవారం జీఎస్టీ పెరుగుదలకు సంబంధించిన వార్తా క్లిప్ప్‌ను షేర్ చేస్తూ ‘‘జీఎస్టీలో అభివృద్ధి 140 శాతం పెరిగింది. అచ్చేదిన్ ఇంకా కొనసాగుతూనే ఉంది’’ అంటూ ట్వీట్ చేశారు. ఈ ట్వీట్‌కు చివర్లో ‘లూట్’ అనే హ్యాష్‌ట్యాగ్‌ను జత చేశారు.


ఇక కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ సైతం విమర్శలు గుప్పించారు. ‘‘మోదీ పాలనలో విలువైనవి ఎప్పుడూ మరింత విలువైనవిగానే మారిపోతుంటాయి. అధిక ద్రవ్యోల్బణం తగ్గుందని నినాదం ఇచ్చిన వారే ప్రజలు పెరిగిన ధరల గురించి మాట్లాడితే దాడులకు పాల్పడుతున్నారు’’ అని అన్నారు. ఇక మరో కాంగ్రెస్ నేత పవన్ ఖేరా మరింత సెటైరికల్‌గా స్పందించారు. ‘‘కిచెన్‌లో 144 సెక్షన్ అమలులోకి వచ్చింది. నాలుగు ఉల్లిపాయలకు మించి ఉంచుకునే పరిస్థితి కనిపించడం లేదు’’ అని ట్వీట్ చేశారు.

Updated Date - 2021-11-24T01:49:07+05:30 IST