వ్యాక్సినేష‌న్ కొర‌త‌ను అధిగ‌మించేందుకు మ‌హారాష్ట్ర స‌ర్కారు కొత్త ప్లాన్‌

ABN , First Publish Date - 2021-05-08T17:09:17+05:30 IST

కరోనా వైరస్‌పై పోరాటంలో భాగంగా....

వ్యాక్సినేష‌న్ కొర‌త‌ను అధిగ‌మించేందుకు మ‌హారాష్ట్ర స‌ర్కారు కొత్త ప్లాన్‌

ముంబై: కరోనా వైరస్‌పై పోరాటంలో భాగంగా మే ఒక‌టి నుండి దేశంలో మూడవ దశ వ్యాక్సినేష‌న్‌ ప్రారంభమ‌య్యింది. అయితే ప‌లు రాష్ట్రాల్లో టీకాల కొర‌త కార‌ణంగా 18 నుంచి 44 సంవత్సరాల మధ్య వ‌య‌సు వారికి టీకాలు వేయడం ఇంకా ప్రారంభించలేదు.


ఈ నేప‌ధ్యంలో వ్యాక్సిన్ల కొరతను అధిగమించేందుకు, టీకా కేంద్రాల్లో రద్దీని నియంత్రించడానికి మహారాష్ట్ర ప్రభుత్వం కొత్త నిర్ణ‌యం తీసుకుంది.  35 నుంచి 44 సంవత్సరాల మధ్య వయస్సు గ‌ల‌వారికి వ్యాక్సిన్లు ఇచ్చేయోచ‌న చేస్తోంది. దీనిపై ముఖ్యమంత్రి ఉద్దవ్ థాక్రే త్వరలోనే నిర్ణయం తీసుకోవచ్చని రాష్ట్ర ఆరోగ్య మంత్రి రాజేష్ తోపే తెలిపారు. అలాగే తగినంత వ్యాక్సిన్ అందుబాటులోకి వ‌చ్చిన‌ప్పుడు18 నుంచి 34 సంవత్సరాల మ‌ధ్య వయస్సు ఉన్నవారికి వ్యాక్సిన్ ఇవ్వ‌నున్నామ‌ని ఆయన అన్నారు.  ప్రస్తుతానికి ఒక్కో జిల్లాలోని ఐదు కేంద్రాలలో 18 నుంచి 44 సంవత్సరాల మ‌ధ్య వయస్సు క‌లిగిన వారికి మాత్రమే టీకాలు ఇస్తున్నామ‌న్నారు. కాగా మహారాష్ట్రలో బుధ, గురువారాల్లో 45 ఏళ్లు పైబడిన 7,00,000 మందికి టీకాలు వేశారు.

Updated Date - 2021-05-08T17:09:17+05:30 IST