వ్యాక్సినేషన్ మరింత ముమ్మరం... వెయిటింగ్ అవసరం లేదిక!

ABN , First Publish Date - 2021-03-21T16:05:59+05:30 IST

మహారాష్ట్రలో కరోనా సెకెండ్‌వేవ్ కొనసాగుతోంది.

వ్యాక్సినేషన్ మరింత ముమ్మరం... వెయిటింగ్ అవసరం లేదిక!

ముంబై: మహారాష్ట్రలో కరోనా సెకెండ్‌వేవ్ కొనసాగుతోంది. ఈ నేపధ్యంలో గ్రేటర్ ముంబై కార్పొరేషన్ మహానగరంలో వ్యాక్సినేషన్ ప్రక్రియను మరింత వేగవంతం చేస్తున్నట్లు తెలిపింది. టీకా కోసం రిజిస్ట్రేషన్ చేయించుకున్నవాళ్లు తమ నంబరు వచ్చేవరకూ వేచి చూడనవసరం లేకుండానే టీకా తీసుకోవచ్చని వివరించింది. 


బీఎంసీ ఒక ప్రకటనలో ‘కోవిడ్-19కు అడ్డుకట్టవేసేందుకు కరోనా వ్యాక్సిన్ అందరికీ అందుబాటులో ఉందని, వ్యాక్సినేషన్ మరింత ముమ్మరంగా నిర్వహిస్తున్నామని తెలిపింది 60 ఏళ్లు పైబడినవారికి, వివిధ అనారోగ్య సమస్యలతో బాధపడుతూ 45 ఏళ్లు పైబడినవారికి వ్యాక్సిన్ అందిస్తున్నామని పేర్కొంది. ఈ వర్గంలో ఉన్నవారంతా ఇప్పుడు రిజిస్ట్రేషన్ అవసరం లేకుండానే ఆసుపత్రులలో టీకా వేయించుకోవచ్చని పేర్కొంది. ఇదిలావుండగా ముంబైలో శనివారం కొత్తగా 2,982 కరోనా కేసులు నమోదయ్యాయి. మహారాష్ట్రలో లాక్‌డౌన్ విధించకపోయినప్పటికీ, కరోనా కట్టడికి కఠిన చర్యలు అవలంబిస్తున్నారు. 

Updated Date - 2021-03-21T16:05:59+05:30 IST