50 ఏళ్లు పైబడినవారికి మార్చి నుంచి టీకా

ABN , First Publish Date - 2021-02-06T07:48:31+05:30 IST

దేశంలో యాభై ఏళ్లు పైబడిన వారికి, దీర్ఘకాల వ్యాధులున్న 50 ఏళ్లులోపు వయసు వారికి మార్చి నెల నుంచి టీకా వేయనున్నట్లు కేంద్ర ఆరోగ్య

50 ఏళ్లు పైబడినవారికి మార్చి నుంచి టీకా

లోక్‌సభలో వెల్లడించిన కేంద్ర మంత్రి హర్షవర్ధన్‌


న్యూఢిల్లీ, ఫిబ్రవరి 5: దేశంలో యాభై ఏళ్లు పైబడిన వారికి, దీర్ఘకాల వ్యాధులున్న 50 ఏళ్లులోపు వయసు వారికి మార్చి నెల నుంచి టీకా వేయనున్నట్లు కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్‌ హర్షవర్ధన్‌ తెలిపారు. వీరి సంఖ్య 27 కోట్ల వరకు ఉంటుందని.. మూడో దశలో వీరికి టీకా ఇస్తామన్నారు. వ్యాక్సిన్‌ పంపిణీ తీరుపై శుక్రవారం లోక్‌సభలో సభ్యులు అడిగిన ప్రశ్నలకు హర్షవర్ధన్‌ సమాధానమిచ్చారు. 50 లక్షల మందికి టీకా పంపిణీ చేసినట్లు వివరించారు.


22 దేశాలు భారత టీకాలు కావాలని కోరినట్లు తెలిపారు. 15 దేశాలకు 56 లక్షల డోసులను ఉచితంగా ఇచ్చామన్నారు. దేశంలో గురువారం 11,184 సెషన్లలో 5.09 లక్షల మందికి వ్యాక్సిన్‌ వేశారు. కొత్తగా 12,408 మందికి కరోనా నిర్ధారణ అయింది. 120 మంది మృతి చెందారు. 


Updated Date - 2021-02-06T07:48:31+05:30 IST