భారత్‌ను అమెరికా 200 ఏళ్లు పాలించింది

ABN , First Publish Date - 2021-03-22T10:35:21+05:30 IST

మహిళలు చిరిగిపోయి న జీన్స్‌ ధరించడంపై అభ్యంతరం వ్యక్తం చేసి ఇటీవల విమర్శలపాలైన ఉత్తరాఖండ్‌ సీఎం తీరథ్‌ సింగ్‌ మళ్లీ అలాంటి వ్యాఖ్యే చేశారు.

భారత్‌ను అమెరికా 200 ఏళ్లు పాలించింది

అలాంటి దేశం ఇప్పుడు కరోనా కట్టడికి 

తీవ్రంగా శ్రమిస్తోంది: ఉత్తరాఖండ్‌ సీఎం


డెహ్రాడూన్‌, మార్చి 21: మహిళలు చిరిగిపోయి న జీన్స్‌ ధరించడంపై అభ్యంతరం వ్యక్తం చేసి ఇటీవల విమర్శలపాలైన ఉత్తరాఖండ్‌ సీఎం తీరథ్‌ సింగ్‌ మళ్లీ అలాంటి వ్యాఖ్యే చేశారు. భారత్‌ను అమెరికా 200 ఏళ్లు పాలించిందని, ప్రపంచాన్నే పాలించిన అమెరికా ఇప్పుడు కొవిడ్‌ను నియంత్రించేందుకు తీవ్రంగా శ్రమిస్తోందని ఆయన అన్నారు. కొవిడ్‌ కేసుల సంఖ్యపై భారత్‌ను అమెరికాతో పోల్చారాయన.


‘‘కొవిడ్‌ కట్టడిలో ఇతర దేశాలతో పోలిస్తే భారత్‌ చాలా మెరుగ్గా ఉంది. భారతీయులను 200 ఏళ్లపాటు బానిసలుగా చేసిన అమెరికా కూడా కొవిడ్‌ను నియంత్రించడానికి తీవ్రంగా శ్రమిస్తోంది. అక్కడ మళ్లీ లాక్‌డౌన్‌ విధించే పరిస్థితి ఉంది’’ అని ఆయన పేర్కొన్నారు. అలాగే భారత ప్రధానిగా మోదీ స్థానంలో మరొకరు ఉండుంటే పరిస్థితులు ఘోరంగా ఉండేవని, కరోనా నుంచి ప్రతిఒక్కరినీ మోదీ కాపాడారని చెప్పారు.

Updated Date - 2021-03-22T10:35:21+05:30 IST