యూపీలో పలు రైల్వేస్టేషన్ల పేర్లు మార్పు...సర్కారు ఉత్తర్వులు

ABN , First Publish Date - 2021-12-30T13:02:09+05:30 IST

ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో పలు రైల్వేస్టేషన్ల పేర్లను మారుస్తూ యూపీ సర్కారు చర్యలు తీసుకుంది...

యూపీలో పలు రైల్వేస్టేషన్ల పేర్లు మార్పు...సర్కారు ఉత్తర్వులు

ఝాన్సీ : ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో పలు రైల్వేస్టేషన్ల పేర్లను మారుస్తూ యూపీ సర్కారు చర్యలు తీసుకుంది.ఝాన్సీ రైల్వేస్టేషన్ పేరును వీరాంగణ లక్ష్మీబాయి రైల్వేస్టేషనుగా మారుస్తూ యూపీ సర్కారు పంపిన ప్రతిపాదనలను కేంద్ర ప్రభుత్వం తాజాగా ఆమోదించింది. గతంలో మొగల్ సరాయ్ రైల్వేస్టేషన్ పేరును పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ్ రైల్వేస్టేషనుగా మార్చారు. అలహాబాద్ పేరును ప్రయాగరాజ్ అని మార్చారు. దీంతోపాటు యూపీలోని సుల్తాన్‌పూర్, మీర్జాపూర్, అలీఘడ్, ఫిరోజాబాద్, మెయిన్‌పురిచ ఘాజీపూర్, బస్తీపూర్ రైల్వేస్టేషన్ల పేర్లను కూడా మార్చాలని యూపీ ప్రభుత్వం ప్రతిపాదనలు రూపొందించింది. ఏ రాష్ట్రంలో లేని విధంగా యూపీలో యోగి సర్కారు పలు రైల్వేస్టేషన్ల పురాతన పేర్లను మార్చాలని నిర్ణయించింది.అభివృద్ధిని వదిలి రైల్వేస్టేషన్ల పేర్ల మార్పుకే యూపీ సర్కారు ప్రాధాన్యం ఇస్తుందని పలువురు విమర్శిస్తున్నారు. 


Updated Date - 2021-12-30T13:02:09+05:30 IST