యూపీ: మొబైల్ షాపులో భారీ చోరీ

ABN , First Publish Date - 2021-06-22T17:34:02+05:30 IST

ఉత్తరప్రదేశ్: ఝాన్సీలోని ఓ మొబైల్ షాపులో భారీ చోరీ జరిగింది.

యూపీ: మొబైల్ షాపులో భారీ చోరీ

ఉత్తరప్రదేశ్: ఝాన్సీలోని ఓ మొబైల్ షాపులో భారీ చోరీ జరిగింది. సుమారు రూ. 40 లక్షల విలువ చేసే స్మార్టు ఫోన్లు దొంగ దోచుకుపోయాడు. ఝాన్సీ మున్సిపల్ కార్యాలయం ఎదురుగా ఉన్న మొబైల్ షాపులోకి చొరబడిన దొంగ అందులోని సెల్ ఫోన్లు మొత్తం పట్టుకుపోయాడు. షాపు షెట్టర్‌ను కట్ చేసి లోపలకు ప్రవేశిస్తున్న దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డు అయ్యాయి. ఝాన్సీ నడు బొడ్డు ప్రాంతంలో  తెల్లవారు జామున జరిగిన ఈ ఘటనపై  పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Updated Date - 2021-06-22T17:34:02+05:30 IST