క్రూయిజ్ షిప్ ప్రయాణాలు చేయొద్దు...అమెరికన్లకు US ఆరోగ్యశాఖ ఆదేశం

ABN , First Publish Date - 2021-12-31T13:52:16+05:30 IST

ఒమైక్రాన్ వేరియంట్ కొవిడ్ -19 కేసులు పెరుగుతున్న నేపథ్యంలో వ్యాక్సిన్ తీసుకున్నప్పటికీ క్రూయిజ్ షిప్...

క్రూయిజ్ షిప్ ప్రయాణాలు చేయొద్దు...అమెరికన్లకు US ఆరోగ్యశాఖ ఆదేశం

న్యూయార్క్: ఒమైక్రాన్ వేరియెంట్ కొవిడ్ -19 కేసులు పెరుగుతున్న నేపథ్యంలో వ్యాక్సిన్ తీసుకున్నప్పటికీ క్రూయిజ్ షిప్ ప్రయాణానికి దూరంగా ఉండాలని యూఎస్ ఆరోగ్యశాఖ అధికారులు అమెరికన్లకు సూచించారు.‘‘ కొవిడ్ వ్యాక్సిన్ వేయించుకున్నవారు కూడా క్రూయిజ్ షిప్ ప్రయాణాన్ని నివారించండి’’ అని యూఎస్ సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ ఆదేశించింది. క్రూయిజ్ ప్రయాణాల్లో కొవిడ్ సోకే ముప్పు అత్యధికంగా ఉన్నందువల్ల అమెరికా ఈ ఆదేశాలు జారీ చేసింది. డిసెంబరు 15 నుంచి 29 తేదీల మధ్య క్రూయిజ్ షిప్ లలో 5,013 మంది ప్రయాణికులకు కరోనా సోకిందని వెల్లడైంది. కొవిడ్ టీకాలు వేసుకోవడంతోపాటు, మాస్కులు ధరించాలని అమెరికా వైద్యాధికారులు సూచించారు.క్రూయిజ్ షిప్ లలో కొవిడ్ సులభంగా వ్యాప్తిచెందుతున్నందున ప్రయాణాలను విరమించుకోవాలని అమెరికా ఆరోగ్యశాఖ అధికారులు ప్రజలను కోరారు.


Updated Date - 2021-12-31T13:52:16+05:30 IST