అమెరికా విదేశాంగ కార్యదర్శి భారత పర్యటన
ABN , First Publish Date - 2021-07-25T00:47:11+05:30 IST
అమెరికా విదేశాంగ కార్యదర్శి ఆంథోనీ బ్లింకెన్ రెండు రోజుల పర్యటన నిమిత్తం ఈ నెల 27న భారత్‌కు రానున్నారు. 27-28తేదీల్లో భారత ప్రధాని నరేంద్ర మోదీ, విదేశాంగ శాఖ మంత్రి జై శంకర్‌తో ఆయన సమా

వాషింగ్టన్: అమెరికా విదేశాంగ కార్యదర్శి ఆంథోనీ బ్లింకెన్ రెండు రోజుల పర్యటన నిమిత్తం ఈ నెల 27న భారత్‌కు రానున్నారు. 27-28తేదీల్లో భారత ప్రధాని నరేంద్ర మోదీ, విదేశాంగ శాఖ మంత్రి జై శంకర్‌తో ఆయన సమావేశం కానున్నారు. ఈ సమావేశంలో భాగంగా కొవిడ్-19 ప్రతిస్పందన ప్రయత్నాలు, భద్రతలో ఇరు దేశాల భాగస్వామ్యం, వాతావరణ సంక్షోభం వంటి అంశాలపై చర్చించనున్నట్టు తెలుస్తోంది. ఇదిలా ఉంటే.. అగ్రరాజ్య అధినేతగా జో బైడెన్ బాధ్యతలు స్వీకరించిన తర్వాత అమెరికా విదేశాంగ కార్యదర్శిగా ఆంథోనీ బ్లింకెన్ చార్జ్ తీసుకున్నారు. విదేశాంగ కార్యదర్శిగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం ఆయన తొలిసారిగా భారత్‌లో పర్యటించనున్నారు.