ఇమిగ్రేషన్‌కు ప్రతిపాదిత బయోమెట్రిక్స్ నిబంధన ఉపసంహరణ : యూఎస్
ABN , First Publish Date - 2021-05-08T09:30:12+05:30 IST
ఇమిగ్రేషన్ ప్రయోజనాలు పొందడానికి ప్రతి దరఖాస్తుదారు బయోమెట్రిక్ వివరాలు సేకరించాలన్న డొనాల్డ్ ట్రంప్ కాలం నాటి ప్రతిపాదనను అమెరికా ప్రభుత్వం శుక్రవారం

వాషింగ్టన్, మే 7: ఇమిగ్రేషన్ ప్రయోజనాలు పొందడానికి ప్రతి దరఖాస్తుదారు బయోమెట్రిక్ వివరాలు సేకరించాలన్న డొనాల్డ్ ట్రంప్ కాలం నాటి ప్రతిపాదనను అమెరికా ప్రభుత్వం శుక్రవారం ఉపసంహరించుకుంది. మే 17 నుంచి హెచ్-4, ఎల్-2, కొన్ని ఈ నాన్ఇమిగ్రెంట్ కేటగిరీలకు బయోమెట్రిక్స్‌ను నిలుపుదల చేస్తున్నట్టు యూఎస్ సిటిజన్‌షి్‌ప, ఇమిగ్రేషన్ సర్వీసెస్ ప్రకటించిన కొన్ని రోజులకే తాజా ప్రకటన వెలువడింది. దీని వల్ల అనేక మందికి ఊరట లభించనుంది.