Chennai లో తాగునీటికి ప్రత్యేక పథకం.. అసెంబ్లీలో మంత్రి ప్రకటన
ABN , First Publish Date - 2021-08-25T16:38:21+05:30 IST
ప్రతిపక్ష విప్ ఎస్పీ వేలుమణి అడిగిన ప్రశ్నకు మంత్రి

చెన్నై/పెరంబూర్ : శాసనసభలో మంగళవారం నగరాభివృద్ధి శాఖ పద్దుపై చర్చ జరిగింది. ప్రతిపక్ష విప్ ఎస్పీ వేలుమణి అడిగిన ప్రశ్నకు మంత్రి కేఎన్ నెహ్రూ సమాధానమిస్తూ, చెన్నై నగరంలో రోజువారీ తాగునీటి వినియోగం 1,150 మిలియన్ లీటర్లుగా వుందని, కానీ ప్రస్తుతం 830 నుంచి 840 మిలియన్ లీటర్లు మాత్రమే అందజేస్తున్నామన్నారు. నగరంలో తాగునీటి కొరత తీర్చేలా చర్యలు చేపట్టాలనే సీఎం ఆదేశాలతో, చెన్నై, శివారు ప్రాంతాల్లోని 500 చెరువుల్లో ప్రజాపనుల శాఖ అనుమతులతో అధిక నీటిని నిల్వచేసేలా పథకం రూపొందించినట్టు మంత్రి తెలిపారు.
అమ్మ స్కూటర్లపై మహిళల్లో తగ్గిన ఆసక్తి..
తాము ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు మహిళలకు బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పించామని మంత్రి పెరియకరుప్పన్ తెలిపారు. శాసనసభలో మంగళవారం గ్రామీణాభివృద్ధి శాఖ పద్దుపై జరిగిన చర్చల్లో మాజీ మంత్రి ఎస్పీ వేలుమణి మాట్లాడుతూ, అమ్మ స్కూటర్ పథకం మహిళల్లో మంచి ఆదరణ పొందిందని, ఈ పథకం కొనసాగించాలని కోరారు. ఈ ప్రశ్నకు మంత్రి కరుపన్నన్ సమాధానమిస్తూ, ప్రస్తుతం తాము ఎన్నికల హామీ మేరకు మహిళలకు బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పించామని, దీంతో, ఉద్యోగాలకు వెళ్లే వారు సహా అన్ని వర్గాల మహిళలు ఈ పథకంలో లబ్ధ్దిపొందుతున్నారన్నారు. ప్రస్తుతం మహిళలకు అమ్మ స్కూటర్ పథకంపై ఆసక్తి లేదని మంత్రి బదులిచ్చారు.