క‌రోనాతో 1600 మంది టీచ‌ర్లు మృతి... ఆందోళ‌న‌కు దిగిన ఉపాధ్యాయ సంఘం!

ABN , First Publish Date - 2021-05-18T16:50:09+05:30 IST

ఇటీవల జ‌రిగిన‌ పంచాయితీ ఎన్నికల విధుల్లో పాల్గొన్న...

క‌రోనాతో 1600 మంది టీచ‌ర్లు మృతి... ఆందోళ‌న‌కు దిగిన ఉపాధ్యాయ సంఘం!

లక్నో: ఇటీవల జ‌రిగిన‌ పంచాయితీ ఎన్నికల విధుల్లో పాల్గొన్న 1600 మంది ఉపాధ్యాయులు క‌రోనా సోక‌డంతో మృత్యువాత ప‌డ్డార‌ని ఉత్తరప్రదేశ్ ఉపాధ్యాయ సంఘం పేర్కొంది. బాధిత కుటుంబాల‌కు కోటి రూపాయ‌ల చొప్పు న‌ష్ట‌పరిహారం, బాధిత కుటుంబ సభ్యుల‌లో ఒక‌రికి ఉద్యోగం ఇవ్వాల‌ని డిమాండ్ చేస్తూ ఉపాధ్యాయ సంఘం యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌కు లేఖ రాసింది. దానిలో మృతిచెందిన‌ ఉపాధ్యాయులు, ఇత‌ర సిబ్బంది వివ‌రాల‌ను తెలియ‌జేసింది.  బాధిత కుటుంబంలోని అర్హులైన‌వారికి బీఈడీ, టెట్ ప‌రీక్ష‌ల నుంచి మిన‌హాయింపునిచ్చి టీచ‌రు పోస్టుల‌లో నియ‌మించాల‌ని సంఘం కోరుతోంది. అలాగే క‌రోనాతో మృతి చెందిన ఉపాధ్యాయుల‌ను కరోనా యోధులుగా ప్రకటించాలని ఉపాధ్యాయ సంఘం డిమాండ్ చేసింది. 

Updated Date - 2021-05-18T16:50:09+05:30 IST