ఏం చేస్తామనేది సీక్రెట్.. మార్చి నాటికి మహారాష్ట్రలో బీజేపీ ప్రభుత్వం: కేంద్రమంత్రి

ABN , First Publish Date - 2021-11-26T22:54:58+05:30 IST

సీఎం ఉద్ధవ్ థాకరేకు స్వాతంత్ర్యం వచ్చిన సంవత్సరం గుర్తుండకపోవడంపై నారాయణ రాణే తీవ్ర విమర్శలు గుప్పించారు. దీంతో ఆయనను మహారాష్ట్ర పోలీసులు అరెస్ట్ చేశారు. అనంతరం ఆయన బెయిల్‌పై విడుదల అయ్యారు..

ఏం చేస్తామనేది సీక్రెట్.. మార్చి నాటికి మహారాష్ట్రలో బీజేపీ ప్రభుత్వం: కేంద్రమంత్రి

ముంబై: మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరేపై అనుచిత వ్యాఖ్యలు చేశారనే కారణంతో అరెస్టైన కేంద్ర నారాయణ రాణె ఉన్నట్టుండి బాంబ్ పేల్చారు. వచ్చే మార్చి నాటికి మహారాష్ట్రలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఏర్పడుతుందని ఆయన అన్నారు. అయితే ఎలా ఏర్పాటు చేస్తారని ఆయనను ప్రశ్నించగా ఇప్పుడున్న ప్రభుత్వం ఎలా పడిపోతుందనేది, బీజేపీ ఎలా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందనేది అంతా సీక్రెటని, అది ఇప్పుడు చెప్పమని, అయితే వచ్చే ఎన్నికలకు రెండేళ్ల ముందే మహారాష్ట్రలో బీజేపీ నేతృత్వంలో ప్రభుత్వం ఏర్పడుతుందని కుండబద్ధలు కొట్టి చెప్పారు. శుక్రవారం జైపూర్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో భాగంగా ఆయన మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు.


సీఎం ఉద్ధవ్ థాకరేకు స్వాతంత్ర్యం వచ్చిన సంవత్సరం గుర్తుండకపోవడంపై నారాయణ రాణే తీవ్ర విమర్శలు గుప్పించారు. దీంతో ఆయనను మహారాష్ట్ర పోలీసులు అరెస్ట్ చేశారు. అనంతరం ఆయన బెయిల్‌పై విడుదల అయ్యారు. గత 20 ఏళ్లుగా కేంద్ర మంత్రిని అరెస్ట్ ఇదే మొదటిసారి. కాగా, 2019లో జరిగిన మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ, శివసేన కలిసి పోటీ చేసినప్పటికీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే విషయంలో సయోధ్య కుదరలేదు. దీంతో ఎన్సీపీ, కాంగ్రెస్ పార్టీలతో కలిసి శివసేన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. దీనికి మహా వికాస్ అగాఢీ ప్రభుత్వం అని నామకరణం చేశారు.

Updated Date - 2021-11-26T22:54:58+05:30 IST