బెయిల్ దొరకడంతో ముంబైకి కేంద్రమంత్రి నారాయణ్ రాణె: సందడి చేసిన మద్దతుదారులు!

ABN , First Publish Date - 2021-08-25T13:41:55+05:30 IST

కేంద్రమంత్రి నారాయణ్ రాణెకు నిన్నఅర్థరాత్రి దాటాక కోర్టు...

బెయిల్ దొరకడంతో ముంబైకి కేంద్రమంత్రి నారాయణ్ రాణె: సందడి చేసిన మద్దతుదారులు!

ముంబై: కేంద్రమంత్రి నారాయణ్ రాణెకు నిన్నఅర్థరాత్రి దాటాక కోర్టు నుంచి బెయిల్ మంజూరయ్యింది. రాణేకు రాయగఢ్ కోర్టు బెయిల్ మంజూరు చేసింది. అనంతరం ముంబై చేరుకున్న రాణాకు ఆయన మద్దతుదారులు ఘన స్వాగతం పలికారు.  కాగా రాణె... మ‌హారాష్ట్ర సీఎం ఉద్ధ‌వ్ థాక్రేను లాగిపెట్టి కొట్టాలనుకున్నానని వ్యాఖ్యానించడంతో కలకలం మొదలయ్యింది. 


నారాయ‌ణ్ రాణె... జ‌న్ ఆశీర్వాద్ యాత్ర నిర్వ‌హిస్తున్న సమయంలో మాట్లాడుతూ దేశానికి స్వాతంత్ర్యం ఎప్పుడు వ‌చ్చిందో తెలియ‌ని సీఎం ఉద్ధ‌వ్ థాక్రేను తాను కొడ‌దామ‌నుకున్నానంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. స్వాతంత్ర్యం ఏ సంవత్సరంలో వ‌చ్చిందో ముఖ్య‌మంత్రికి తెలియ‌క‌పోవ‌డం సిగ్గుచేటని పేర్కొన్నారు. మంత్రి రాణె చేసిన వ్యాఖ్య‌ల‌పై శివ‌సేన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ ఉదంతంపై నాసిక్ పోలీసుల‌కు ఫిర్యాదు చేసింది. దీంతో రాణెపై కేసు న‌మోదు చేసి, అరెస్ట్ చేశారు. కేంద్ర‌ మంత్రి నారాయ‌ణ్ రాణె చేసిన వివాదాస్ప‌ద వ్యాఖ్యలతో బీజేపీ, శివ‌సేన మ‌ధ్య మ‌ళ్లీ అంతర్గత యుద్ధం మొద‌లైంది. 

Updated Date - 2021-08-25T13:41:55+05:30 IST