వెయ్యి పీపీఈ కిట్లు, మాస్కులు మేయ‌ర్‌కు అంద‌జేసిన కేంద్ర మాజీ మంత్రి

ABN , First Publish Date - 2021-05-08T11:07:49+05:30 IST

క‌రోనా మ‌హ‌మ్మారి మ‌రింతగా విజృంభిస్తున్న...

వెయ్యి పీపీఈ కిట్లు, మాస్కులు మేయ‌ర్‌కు అంద‌జేసిన కేంద్ర  మాజీ మంత్రి

న్యూఢిల్లీ: క‌రోనా మ‌హ‌మ్మారి మ‌రింతగా విజృంభిస్తున్న ప్ర‌స్తుత త‌రుణంలో వెయ్యి పీపీఈ కిట్లు, మాస్కులు, ఫేస్ షీల్డ్‌లు, గాల్వ్‌ల‌ను ఉత్తర ఢిల్లీ మేయర్ జై ప్రకాష్‌కు కేంద్ర మంత్రి, బీజేపీ సీనియర్ నేత విజయ్ గోయెల్ అంద‌జేశారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ కరోనా మహమ్మారి తాండ‌విస్తున్న ప్ర‌స్తుత‌ పరిస్థితుల్లో ఉత్తర ఢిల్లీ మునిసిపల్ కార్పొరేషన్ పౌరులను అన్నివిధాలా ఆదుకుంటున్న‌ద‌న్నారు. 


ఉత్తర ఢిల్లీ మునిసిపల్ కార్పొరేషన్ ఉద్యోగులు పగలు, రాత్రి పౌరుల సేవలో నిమగ్నమ‌య్యార‌ని తెలిపారు. ఇతర సామాజిక, మత సంస్థలు కూడా ముందుకు వచ్చి... ఉత్తర ఢిల్లీ మునిసిపల్ కార్పొరేషన్‌కు సహాయం అందించాల‌ని ఆయన విజ్ఞప్తి చేశారు. నార్తరన్ కార్పొరేషన్ ప్రతికూల పరిస్థితుల్లో ఎంతో స‌మ‌ర్థ‌వంతంగా పనిచేస్తోందని చెప్పారు. ఢిల్లీ ప్రభుత్వ సహకారం లేకుండా 20 రోజుల్లో కరోనా రోగుల చికిత్స కోసం ప్ర‌త్యేక ఆస్పత్రులను ఏర్పాటు చేసిందని విజ‌య్ గోయ‌ల్ పేర్కొన్నారు.

Updated Date - 2021-05-08T11:07:49+05:30 IST