అసెంబ్లీ ఎన్నికల్లోపు మమత ఒంటరి: అమిత్‌ షా

ABN , First Publish Date - 2021-02-01T06:48:06+05:30 IST

పశ్చిమ బెంగాల్‌ అసెంబ్లీ ఎన్నికలు సమీపించేలోపు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఒంటరిగా మిగిలిపోతారని కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా అన్నారు.

అసెంబ్లీ ఎన్నికల్లోపు మమత ఒంటరి: అమిత్‌ షా

న్యూఢిల్లీ/పుదుచ్చేరి, జనవరి 31: పశ్చిమ బెంగాల్‌ అసెంబ్లీ ఎన్నికలు సమీపించేలోపు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఒంటరిగా మిగిలిపోతారని కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా అన్నారు. బెంగాల్‌ ప్రజల ఆశయాలను నెరవేర్చడంలో ఆమె దారుణంగా విఫలమయ్యారని, పాలన దారి తప్పిందని విమర్శించారు. ఆదివారం హౌరా జిల్లాలో జరిగిన ర్యాలీలో ఢిల్లీ నుంచే ఆన్‌లైన్‌ ద్వారా ఆయన మాట్లాడారు. ‘‘మేనల్లుడి కల్యాణం(లోక్‌సభ సభ్యు డు అభిషేక్‌ బెనర్జీ) కోసమే మమత ప్రభుత్వం పనిచేస్తోంది. మా పార్టీ అధికారంలోకి వస్తే ‘లోకకల్యాణం’ కోసం పనిచేస్తుంది’’ అని హమీ ఇచ్చారు. కాగా, త్వరలో పుదుచ్చేరిలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం 30 సీట్లలో 23 స్థానాలు గెలుస్తామని బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా పుదుచ్చేరిలో జరిగిన ర్యాలీలో ఆత్మవిశ్వాసం వ్యక్తం చేశారు.

Updated Date - 2021-02-01T06:48:06+05:30 IST