బ్లాక్ ఫంగస్‌ను నోటిఫయబుల్ డిసీజ్‌గా రాష్ట్రాలు ప్రకటించాలి : కేంద్రం

ABN , First Publish Date - 2021-05-20T20:21:11+05:30 IST

మ్యుకొర్‌మైకోసిస్ లేదా బ్లాక్ ఫంగస్ వ్యాధిని అంటువ్యాధుల చట్టం, 1897

బ్లాక్ ఫంగస్‌ను నోటిఫయబుల్ డిసీజ్‌గా రాష్ట్రాలు ప్రకటించాలి : కేంద్రం

న్యూఢిల్లీ : మ్యుకొర్‌మైకోసిస్ లేదా బ్లాక్ ఫంగస్ వ్యాధిని అంటువ్యాధుల చట్టం, 1897 ప్రకారం నోటిఫయబుల్ డిసీజ్‌గా ప్రకటించాలని రాష్ట్ర ప్రభుత్వాలను కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ గురువారం కోరింది. కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ (ఎంఓహెచ్ఎఫ్‌డబ్ల్యూ), భారత వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్) జారీ చేసిన మార్గదర్శకాలను పాటించాలని తెలిపింది. మ్యుకొర్‌మైకోసిస్ పరీక్షలు, రోగ నిర్థరణ, నిర్వహణకు సంబంధించి ఈ మార్గదర్శకాలు వివరిస్తున్నాయి. 


మ్యుకొర్‌మైకోసిస్ పరీక్షలు, రోగ నిర్థరణ, మేనేజ్‌మెంట్ కోసం ఎంఓహెచ్ఎఫ్‌డబ్ల్యూ, ఐసీఎంఆర్ జారీ చేసిన మార్గదర్శకాలను అన్ని ప్రభుత్వ, ప్రైవేటు ఆరోగ్య కేంద్రాలు, ఆసుపత్రులు, వైద్య కళాశాలలు పాటించాలని రాష్ట్ర ప్రభుత్వాలకు కేంద్రం తెలిపింది. 


మ్యుకొర్‌మైకోసిస్ లేదా బ్లాక్ ఫంగస్ అత్యంత అరుదైన ఫంగల్ ఇన్ఫెక్షన్. ఇది మన దేశంలో ఢిల్లీ సహా కొన్ని రాష్ట్రాల్లో కనిపిస్తోంది. ఫంగల్ ఇన్ఫెక్షన్ వల్ల ఈ వ్యాధి వస్తోందని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. వాతావరణంలోని శిలీంధ్ర జీవ కణాలు (ఫంగల్ స్పోర్స్) సోకినపుడు మానవులు ఈ వ్యాధి బారిన పడుతున్నారు. 


Updated Date - 2021-05-20T20:21:11+05:30 IST