రాష్ట్రంలో.. నిరుద్యోగుల సంఖ్య 70.30 లక్షలు

ABN , First Publish Date - 2021-08-21T13:24:10+05:30 IST

రాష్ట్రంలో ఎంప్లాయ్‌మెంట్‌ కార్యాలయాల్లో పేర్లు నమోదుచేసుకొని ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న వారి సంఖ్య 70.30 లక్షలుగా ఉంది. ఈ మేరకు రాష్ట్ర ఉద్యోగావకాశాలు

రాష్ట్రంలో.. నిరుద్యోగుల సంఖ్య 70.30 లక్షలు

పెరంబూర్‌(చెన్నై): రాష్ట్రంలో ఎంప్లాయ్‌మెంట్‌ కార్యాలయాల్లో పేర్లు నమోదుచేసుకొని ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న వారి సంఖ్య 70.30 లక్షలుగా ఉంది. ఈ మేరకు రాష్ట్ర ఉద్యోగావకాశాలు మరియు శిక్షణ శాఖ విడుదల చేసిన ప్రకటన మేరకు ఎంప్లాయ్‌మెంట్‌ ఎక్స్చేంజీలలో పేర్లు నమోదుచేసుకొని ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న వారు 70,30,345 మంది కాగా, వారిలో 32,93,401 మంది పురుషులు, 37,36,687 మంది మహిళలు, 257 మంది హిజ్రాలున్నారు. అలాగే, 24 నుంచి 35 ఏళ్లలోపున్న వారు 26,27,949 మంది, 36 నుంచి 57 ఏళ్లలోపున్న వారు 12,77,839 మంది, 58 ఏళ్ల పైబడిన వారు 11,213 మందిగా ఉన్నారు. అదే సమయంలో దివ్యాంగులు 1,37,077 మంది, డిగ్రీ టీచర్లు 3,42,151 మంది, పీజీ టీచర్లు 2,53,447 మంది పేర్లు నమోదుచేసుకొని ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్నారు.

Updated Date - 2021-08-21T13:24:10+05:30 IST