భూటాన్‌లో కూలిన వంతెన.. ముగ్గురు భారతీయులు మృతి
ABN , First Publish Date - 2021-02-10T23:52:56+05:30 IST
భూటాన్‌లో మంగళవారం నాడు దారుణం జరిగింది. నిర్మాణంలో ఉన్న వంతెన కూలడంతో ముగ్గురు భారతీయులు మరణించారు. మరో ఆరుగురి ఆచూకీ గల్లంతయ్యింది.
న్యూఢిల్లీ: భూటాన్‌లో మంగళవారం నాడు దారుణం జరిగింది. నిర్మాణంలో ఉన్న వంతెన కూలడంతో ముగ్గురు భారతీయులు మరణించారు. మరో ఆరుగురి ఆచూకీ గల్లంతయ్యింది. ప్రమాదం సమయంలో వంతెనపై కనీసం 9 మంది ఉన్నట్టు సమాచారం. రాజధాని తింపుకు నైరుతివైపును 60 కిలోమీటర్ల దూరంలో ఉన్న ప్రాంతంలో వ్యాంగ్చూ వంతెన నిర్మాణం జరుగుతోంది. భూటాన్‌లోని పారో అంతర్జాతీయ విమానాశ్రయాన్ని హా జిల్లాను కలిపేందుకు ప్రభుత్వం ఈ బ్రిడ్జి నిర్మాణం చేపట్టింది. కాగా.. గల్లంతైన వారి ఆచూకీ కనుగొనేందుకు ప్రయత్నిస్తున్నామని స్థానిక పోలీసు అధికారి ఒకరు తెలిపారు. మరణించిన వారి ఆత్మకు శాంతి చేకూరేందుకు ప్రార్థిస్తున్నామని, ఇతర వర్కర్లందూ క్షేమంగా తిరిగిరావాలని దేశం కోరుకుంటున్నట్టు ప్రధాని టోటే షేరింగ్ ట్వీట్ చేశారు. కాగా.. ఈ ఘటనలో గల్లంతైన వారు ఏ దేశానికి చెందినవారో ఇంకా తెలియరాలేదు.