ఎవరైనా మనస్తాపం చెందితే క్షమించండి : ఉదయనిధి

ABN , First Publish Date - 2021-01-12T16:00:42+05:30 IST

ఎవరైనా మనస్తాపం చెందితే క్షమించండి : ఉదయనిధి

ఎవరైనా మనస్తాపం చెందితే క్షమించండి : ఉదయనిధి

చెన్నై : తాను మహిళలను కించపరిచేలా మాట్లాడ లేదని, తన వ్యాఖ్యలు ఎవరినైనా బాధిస్తే క్షమించాలని డీఎంకే యువజన విభాగం అధ్యక్షుడు ఉదయనిధి స్టాలిన్‌ కోరారు. ఇటీవల డీఎంకే సభలో పాల్గొన్న ఉదయనిధి శశికళపై చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి. ఈ వ్యవహారంపై ఉదయ నిధికి, శశికళ సోదరుడి కుమారుడు, అన్నా ద్రావిడర్‌ కళగం యువజన విభాగం కార్యదర్శి జయ్‌ఆనంద్‌, పార్టీ అధ్యక్షుడు, తండ్రి దివాకరన్‌ పేరిట నోటీసులు పంపారు. మహిళ అని చూడకుండా కించపరిచేలా వ్యాఖ్యలు చేసి ఉదయనిధి తీరును ఖండిస్తున్నట్టు దివాకరన్‌ లేఖలో పేర్కొన్నారు. మహిళా మోర్చా జాతీయ అధ్యక్షురాలు వానతీ శ్రీనివాసన్‌, బీజేపీ నేత, నటి ఖుష్బూ, అమ్మా మక్కల్‌ మున్నేట్ర కళగం అధ్యక్షుడు టీటీవీ దినకరన్‌ సహా పలు పార్టీల నేతలు ఉదయనిధి వ్యాఖ్యలను ఖండించారు. 

Updated Date - 2021-01-12T16:00:42+05:30 IST