ఫేస్ మాస్క్ లేకుండా సీఎం ఉద్ధవ్ ప్రసంగం

ABN , First Publish Date - 2021-08-10T16:24:57+05:30 IST

మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే సోమవారం మొట్ట మొదటిసారిగా ఫేస్ మాస్క్ ధరించకుండా ఒక బహిరంగ కార్యక్రమంలో ప్రసంగించారు...

ఫేస్ మాస్క్ లేకుండా సీఎం ఉద్ధవ్ ప్రసంగం

ముంబై (మహారాష్ట్ర): మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే సోమవారం మొట్ట మొదటిసారిగా ఫేస్ మాస్క్ ధరించకుండా ఒక బహిరంగ కార్యక్రమంలో ప్రసంగించారు. నాసిక్‌లో జరిగిన కార్యక్రమంలో సీఎం ఉద్ధవ్ మాట్లాడారు. ‘‘నేను ముసుగు ధరించకుండా ప్రసంగించే నా మొదటి ప్రజా కార్యక్రమం ఇది. కరోనావైరస్ వ్యాప్తి తర్వాత నేను మొట్టమొదటిసారిగా నా ముఖం కప్పుకోకుండా మాట్లాడుతున్నాను.’’ అని సీఎం చెప్పారు. ముంబై నుంచి 200 కిలోమీటర్ల దూరంలో ఉన్న నాసిక్ జిల్లాలో పలు అభివృద్ధి ప్రాజెక్టుల ప్రారంభోత్సవానికి ఉద్ధవ్ ఠాక్రే హాజరయ్యారు.గత ఏడాది మార్చి నెలలో కరోనా మహమ్మారి వ్యాప్తి అనంతరం సీఎం ఉద్ధవ్ ఠాక్రే ముఖానికి మాస్కు పెట్టుకొని మాట్లాడారు. ఏడాది తర్వాత మొదటిసారి మాస్కు లేకుండా సీఎం బహిరంగ సభలో ప్రసంగించారు.


Updated Date - 2021-08-10T16:24:57+05:30 IST