Afghanistan crisis: 5వేలమంది అఫ్ఘాన్ శరణార్థులకు యుఏఈ ఆశ్రయం

ABN , First Publish Date - 2021-08-21T13:21:20+05:30 IST

యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ అఫ్ఘానిస్తాన్ నుంచి తరలించిన 5వేల మంది అఫ్ఘాన్ జాతీయులకు ఆతిథ్యమివ్వడానికి అంగీకరించింది...

Afghanistan crisis: 5వేలమంది అఫ్ఘాన్ శరణార్థులకు యుఏఈ ఆశ్రయం

కాబూల్ : యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ అఫ్ఘానిస్తాన్ నుంచి తరలించిన 5వేల మంది అఫ్ఘాన్ జాతీయులకు ఆతిథ్యమివ్వడానికి అంగీకరించింది. అమెరికా తన విమానాల్లో అఫ్ఘాన్ వాసులను యూఏఈకు తరలించింది. తాలిబాన్లు కాబూల్ ను స్వాధీనం చేసుకున్న తర్వాత తాము 5వేల మంది అఫ్ఘాన్ పౌరులకు ఆతిథ్యం ఇస్తున్నట్లు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ విదేశీ వ్యవహారాలు, అంతర్జాతీయ సహకార మంత్రిత్వ శాఖ వెల్లడించింది.రాబోయే రోజుల్లో అఫ్ఘాన్ వాసులు యూఎస్‌ఏ విమానంలో తమ దేశానికి చేరుకుంటారని యూఏఈ అధికారులు తెలిపారు.


తాలిబాన్లు ఆగస్టు 15 న కాబూల్‌లోకి ప్రవేశించారు, దీనివల్ల అమెరికా మద్దతు ఉన్న అఫ్ఘాన్ ప్రభుత్వం కూలిపోయింది. అంతర్జాతీయంగా గుర్తింపు పొందిన అఫ్ఘాన్ ప్రెసిడెంట్ అష్రఫ్ ఘనీ రాజీనామా చేసి దేశం విడిచి యూఏఈకి పారిపోయారు. అఫ్ఘాన్ ను హస్తగతం చేసుకున్న తాలిబాన్లు ప్రతీకారం తీర్చుకుంటారనే భయంతో వేలాది మంది అఫ్ఘాన్‌ పౌరులు దేశం నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నిస్తున్నారు.

Updated Date - 2021-08-21T13:21:20+05:30 IST