జమ్మూకశ్మీరులో ఎన్‌కౌంటర్...ఇద్దరు ఉగ్రవాదుల హతం

ABN , First Publish Date - 2021-07-08T12:34:28+05:30 IST

జమ్మూకశ్మీరులోని పుల్వామా జిల్లా పూచల్ ప్రాంతంలో గురువారం తెల్లవారుజామున జరిగిన ఎన్‌కౌంటరులో ఇద్దరు గుర్తుతెలియని ఉగ్రవాదులు...

జమ్మూకశ్మీరులో ఎన్‌కౌంటర్...ఇద్దరు ఉగ్రవాదుల హతం

పుల్వామా(జమ్మూకశ్మీర్): జమ్మూకశ్మీరులోని పుల్వామా జిల్లా పూచల్ ప్రాంతంలో గురువారం తెల్లవారుజామున జరిగిన ఎన్‌కౌంటరులో ఇద్దరు గుర్తుతెలియని ఉగ్రవాదులు మరణించారు. పూచల్ ప్రాంతంలో ఉగ్రవాదులున్నారనే సమాచారం మేర భద్రతా బలగాలు బుధవారం రాత్రి గాలింపు ప్రారంభించాయి. గురువారం తెల్లవారుజామున ఉగ్రవాదులు కాల్పులు జరపడంతో జవాన్లు ఎదురుకాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో ఇద్దరు గుర్తుతెలియని ఉగ్రవాదులు హతమయ్యారని జమ్మూకశ్మీర్ ఐజీ విజయకుమార్ ట్వీట్ చేశారు. ఉగ్రవాదుల కోసం గాలింపు కొనసాగుతోంది. కుల్గాం ప్రాంతంలోని జోడార్ వద్ద బుధవారం జరిగిన మరో ఎన్ కౌంటర్ లో లష్కరే తోయిబాకు చెందిన ఇద్దరు ఉగ్రవాదులు మరణించారు.జమ్మూకశ్మీర్ పోలీసులు, భద్రతాబలగాలు సంయుక్తంగా ఉగ్రవాదుల కోసం గాలిస్తున్నాయి. 

Updated Date - 2021-07-08T12:34:28+05:30 IST