అన్నాడీఎంకే, డీఎంకే కార్యకర్తల ట్విట్టర్ వార్

ABN , First Publish Date - 2021-05-30T21:45:11+05:30 IST

అయితే కొవిడ్ నియంత్రణలో స్టాలిన్ సర్కార్ విఫలమైందని ప్రతిపక్ష పార్టీ అన్నాడీఎంకే సహా బీజేపీ, ఇతర ప్రతిపక్ష పార్టీలు విమర్శలు గుప్పిస్తున్నాయి. ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ ఆదివారం ‘గోబ్యాక్ స్టాలిన్’’ (#GoBackStalin) అనే హ్యాష్‌ట్యాగ్ ఇండియా ట్రెండ్స్‌లో టాప్‌లో కొనసాగింది.

అన్నాడీఎంకే, డీఎంకే కార్యకర్తల ట్విట్టర్ వార్

చెన్నై: తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్.. ఆదివారం నాటి కొయంబత్తూర్, తిరుప్పూర్ పర్యటన అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య సోషల్ వార్‌కు తెరలేపింది. రాష్ట్రంలో మొదటి వేవ్ కంటే సెకండ్ వేవ్‌లో ఎక్కువ కొడివ్ పాజిటివ్ కేసులు నమోదు అవుతున్నాయి. అయితే కొవిడ్ నియంత్రణలో స్టాలిన్ సర్కార్ విఫలమైందని ప్రతిపక్ష పార్టీ అన్నాడీఎంకే సహా బీజేపీ, ఇతర ప్రతిపక్ష పార్టీలు విమర్శలు గుప్పిస్తున్నాయి. ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ ఆదివారం ‘గోబ్యాక్ స్టాలిన్’’ (#GoBackStalin) అనే హ్యాష్‌ట్యాగ్ ఇండియా ట్రెండ్స్‌లో టాప్‌లో కొనసాగింది.


ఇంతలో డీఎంకే కూడా అదే స్థాయిలో ప్రతిస్పందించింది. ‘‘వి స్టాండ్ విత్ స్టాలిన్’’ (#WeStandWithStalin) అనే హ్యాష్‌ట్యాగ్‌తో ప్రతిదాడి ప్రారంభించారు. ప్రస్తుతం ఇదే హ్యాష్‌ట్యాగ్ ఇండియా ట్రెండింగ్‌లో టాప్‌లో ఉంది.


#GoBackStalin పై కొన్ని ట్వీట్లు


#WeStandWithStalin పై కొన్ని ట్వీట్లు

Updated Date - 2021-05-30T21:45:11+05:30 IST